Begin typing your search above and press return to search.

సిక్స్ గ్యారెంటీలే బీఆర్ఎస్ ప్రచారాస్త్రమా ?

సిక్స్ గ్యారెంటీస్ లో రేవంత్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది రెండు హామీలను మాత్రమే. మిగిలిన నాలుగు హామీల అమలుకు కసరత్తు చేస్తోంది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 10:30 AM GMT
సిక్స్ గ్యారెంటీలే బీఆర్ఎస్ ప్రచారాస్త్రమా ?
X

తెలంగాణాలో తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో విచిత్రమైన పరిస్ధితులను జనాలు చూడబోతున్నారు. అదేమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్న సిక్స్ గ్యారెంటీస్ ను పార్లమెంటు ఎన్నికల్లో కూడా టచ్ చేయాలని నిర్ణయించుకుంది. సిక్స్ గ్యారెంటీస్ లో ఎన్నింటిని అమలుచేసింది, మిగిలిన వాటి అమలుకు జరుగుతున్న కసరత్తును జనాలకు వివరించాలని రేవంత్ రెడ్డి అండ్ కో కసరత్తు చేస్తున్నారు. వీలైనంతలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజయ్యేంతలో మిగిలిన వాటిని కూడా అమల్లోకి తేవాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం.

సిక్స్ గ్యారెంటీస్ లో రేవంత్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది రెండు హామీలను మాత్రమే. మిగిలిన నాలుగు హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోగా అమలు చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ జనాలకు హామీలిచ్చింది. 100 రోజుల గడువు మార్చి రెండోవారంతో పూర్తవుతుంది. అంటే సిక్స్ గ్యారెంటీస్ కు మరో మూడు వారాల గడువు మాత్రమే మిగిలుంది. నిజానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలుచేయటం ఏ పార్టీకి సాధ్యంకాదు.

అందుకనే కీలకమైన హామీలను ముందు అమలుచేసి మిగిలిన వాటిగురించి తర్వాత ఆలోచిస్తాయి. కాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు 100 రోజులను గడువుగా ప్రకటించటమే పెద్ద సమస్యగా మారింది. సరిగ్గా ఇక్కడే బీఆర్ఎస్ ఎంటరయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అంతా బోగస్ అంటు గోల చేస్తోంది. ఎలాగంటే హామీల అమలుకు ఏడాదికి సుమారు రు. 1.54 లక్షల కోట్లు అవసరమైతే కాంగ్రెస్ మొన్నటి బడ్జెట్లో కేటాయించింది కేవలం రు. 53 వేల కోట్లు మాత్రమే.

దీని ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీఅవుతున్నారు. బడ్జెట్ కేటాయింపులనే తమ ఆరోపణలకు మద్దతుగా జనాలకు చూపాలని డిసైడ్ అయ్యింది. కేసీయార్, కేటీయార్, హరీష్ రావు ఆధ్వర్యంలో రాష్ట్రమంతా పర్యటనలు చేసి కాంగ్రెస్ హామీలకు వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తేవాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. సిక్స్ గ్యారెంటీస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ జనాలను మోసంచేసిందని అవి ఎప్పటికీ అమలయ్యే పథకాలు కావని కేసీయార్ అండ్ కో ప్రచారం చేయబోతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమి చేయబోతున్నారు ? జనాలు ఏమిచేస్తారో చూడాలి.