Begin typing your search above and press return to search.

తల్లి మృతదేహంతో ఏడాదిగా ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు

కొన్ని ఉదంతాలు బయటకు విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. సదరు వ్యక్తుల మానసిక పరిస్థితి అయ్యో అనిపించేలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 12:12 PM IST
తల్లి మృతదేహంతో ఏడాదిగా ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు
X

కొన్ని ఉదంతాలు బయటకు విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. సదరు వ్యక్తుల మానసిక పరిస్థితి అయ్యో అనిపించేలా ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల వైనం షాకింగ్ గా మారింది. కారణం.. ఏడాది క్రితం చనిపోయిన తమ తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే గుట్టుగా ఉంచేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

వారణాసిలోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో 27 ఏళ్ల పల్లవి పెద్దమ్మాయి కాగా.. 17 ఏళ్ల వైశ్విక్ చిన్న కుమార్తె. పల్లవి పీజీ చేయగా.. వైశ్విక్ పదో తరగతి వరకు చదువుకుంది. రెండేళ్ల క్రితం ఉష భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వీరికి చిన్నషాపు ఉంది. దాన్ని నడుపుతూ జీవనం సాగిస్తుంటారు.

గత ఏడాది ఇంటికి పెద్ద దిక్కుఅయిన ఉష అనారోగ్యంతో మరణించారు. ఆ విషయాన్ని అక్కాచెల్లెళ్లు ఎవరికి చెప్పలేదు. ఇంట్లోనే మృతదేహాన్నిపెట్టుకొని.. ఏదైనా అవసరాల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చి వెళుతుండేవారు. ఇదిలా ఉండగా.. ఉష సోదరుడు ధర్మేంద్ర కుమార్ తన చెల్లెఎంతసల్ని చూసేందుకు మీర్జాపూర్ నుంచి వారణాసికి వచ్చారు. ఎంతసేపు ప్రయత్నించినా ఇంటి తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో.. వారు ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. ఒక గదిలో మహిళ అస్తిపంజరం.. మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉండటం చూసి షాక్ తిన్నారు. వారి మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్న విషయాన్ని గుర్తించారు. దీంతో వారిని వైద్య పరీక్షల కోసం వారిని ఆసుపత్రికి తరిలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.