Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి రాహుల్ సిప్లిగంజ్... పార్టీ - పోటీ కన్ ఫాం?

బిగ్‌ బాస్ విన్నర్‌ ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు రాజకీయ రంగప్రవేశానికి సిద్దమైనట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   5 Aug 2023 5:07 AM GMT
రాజకీయాల్లోకి రాహుల్ సిప్లిగంజ్... పార్టీ - పోటీ కన్ ఫాం?
X

రాహుల్ సిప్లిగంజ్ ఎన్నికల బరిలోకి దిగనున్నారా? రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోతున్నారా? అది కూడా హైదరాబాద్ లోని ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారా? ఈ మేరకు ఒక పార్టీ పెద్దలు రాహుల్ తో ఈ మేరకు చర్చలు జరిగాపారా? అంటే... అవుననే సమాధానం వస్తుందంటూ గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి!

అవును... బిగ్‌ బాస్ విన్నర్‌, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు రాజకీయ రంగప్రవేశానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ పోటీ చేస్తారని ఒక గాసిప్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుందని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. పార్టీ, పోటీచేసే సీటు కూడా ఇదేనంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

గతకొన్ని రోజులుగా హీరో నితిన్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ మేరకు ఆయనతో చర్చలు జరుపుతున్నారని.. నిజామాబాద్ నుంచి ఆయన పోటీ ఉండొచ్చని గాసిప్స్ హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో రాహుల్ సిప్లిగంజ్ ను కూడా రాజకీయాల్లోకి తేబోతున్నారని.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి రాహుల్ సిప్లిగంజ్ సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు సైతం ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ ముందుకు వస్తే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబెట్టబోతోందని అంటున్నారు.

ఇందులో భాగంగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్దిగా రాహుల్ సిప్లిగంజ్ కు అవకాశం కల్పించేలా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. గోషామహల్ నుంచి కాంగ్రెస్ కు రాహుల్ సరైన అభ్యర్ది అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.

కాగా... గోషామహల్ నుంచి ప్రస్తుతం సిట్టిగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి రాజా సింగ్ ఉన్న సంగతి తెలిసిందే. 2009లో బీజేపీ నుంచి పోటీచేసిన ప్రేం సింగ్ రాథోడ్... 2018 ఎన్నికల్లో బీఆరెస్స్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో గతేన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ స్థానంలో పోటీచేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా ఈ సీటు ఆశిస్తున్నారని అంటున్నారు.

ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ అయితేనే ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో సరైన అభ్యర్ది అని కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ క్లియర్ గానే ఉన్నప్పటికీ... రాహుల్ నుంచి మాత్రం ఇంకా స్పష్టర రాలేదని... ఆయనకున్న ఆసక్తిపైనే తదుపరి చర్చలు ఉండోచ్చని అంటున్నారని తెలుస్తోంది.

ఏది ఏమైనా... తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపు అనివార్యం అయిన వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ వెళ్తోంది! కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ... తెలంగాణలో ఇప్పటికే కీలక నాయకుల చేరికలతో సందడిగా ఉన్న సంగతి తెలిసిందే.