భర్త తీర్చలేని కోరికలు తీరుస్తోంది.. వైరల్ అవుతోన్న కొత్త ట్రెండ్
ఇటువంటి పరిస్థితుల్లో డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళలకు ఈ స్పా ఒక మంచి ఎంపిక అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
By: Tupaki Desk | 29 May 2025 9:11 AM ISTసాధారణంగా భార్యాభర్తల బంధంలో శ్రద్ధ, ప్రేమ, రొమాన్స్ అనేవి చాలా ముఖ్యం. అయితే కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల భాగస్వామి నుండి ఈ అటెన్షన్ లభించకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడికి గురయ్యే మహిళల కోసం సింగపూర్‌లోని ఒక స్పా సెంటర్ వినూత్న సేవలను అందిస్తోంది. భర్త దగ్గర పొందలేని సుఖాన్ని, రొమాంటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్పా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్పా కేవలం లగ్జరీ ట్రీట్‌మెంట్స్‌తో పాటు, ప్రశాంతమైన, శ్రద్ధతో కూడిన రొమాంటిక్ వాతావరణాన్ని అందిస్తుంది. ఈ సెంటర్లో మహిళలకు వారి జీవితంలో ఎప్పుడూ చూడని రొమాంటిక్ అనుభవాలను ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- ప్రత్యేక శ్రద్ధతో కూడిన అనుభవం
తమ భాగస్వామి నుండి తగినంత శ్రద్ధ లభించని మహిళలు ఈ స్పాను సందర్శిస్తే, వారికి రెగ్యులర్ స్పా ట్రీట్‌మెంట్స్‌తో పాటు, అక్కడ ఉండే పురుష అటెండెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరు కస్టమర్లతో కూర్చుంటారు, బుజ్జగిస్తారు, చాలా ప్రేమగా మాట్లాడుతూ తోడుగా ఉంటారు. తినిపిస్తారు, కాళ్ళు నొక్కడం, సున్నితంగా ముట్టుకోవడం వంటివి చేస్తూ, వారికి నచ్చిన విధంగా రొమాంటిక్‌గా ప్రవర్తిస్తారు. అయితే ఇది లైంగిక సంబంధం కాకుండా, రొమాన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టమవుతోంది.
డిప్రెషన్‌కు ఒక పరిష్కారమా?
ఇటువంటి పరిస్థితుల్లో డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళలకు ఈ స్పా ఒక మంచి ఎంపిక అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అటెన్షన్ పొందేందుకు ఇదొక చక్కటి ప్రదేశమని వారు పేర్కొంటున్నారు. ఆధునిక జీవనశైలిలో పెరిగిన ఒత్తిడి, సంబంధాల్లో ఏర్పడుతున్న అంతరాలు ఇలాంటి వినూత్న వ్యాపారాలకు దారితీస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇలాంటి స్పా సెంటర్ల వలన సామాజికంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.
