Begin typing your search above and press return to search.

సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారా ?

టీవీ డిబేట్లు, మీడియా సమావేశాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రతిపక్షాలను బాగా చులకనగా మాట్లాడారనే ఆరోపణలున్నాయి.

By:  Tupaki Desk   |   1 Feb 2024 11:30 PM GMT
సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారా ?
X

ఇపుడీ విషయంపైనే బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ఒకపుడు అంటే దాదాపు పదేళ్ళపాటు పార్టీతో పాటు ప్రభుత్వంలో చాలా హడావుడి చేసిన నేతల్లో చాలామంది కొద్దిరోజులుగా పూర్తిగ సైలెంట్ అయిపోయారు. అసలు వీళ్ళు పార్టీలోనే ఉన్నారా లేదా అనే సందేహాలు మిగిలిన వాళ్ళల్లో పెరిగిపోతున్నాయి. ఎంఎల్సీ నవీన్ కుమార్, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శంకర్ నాయక్, రసమయి బాలకృష్ణ, గువ్వల బాలరాజు, గదరి కిషోర్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్కసుమన్ లాంటి వాళ్ళు చాలామంది ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

టీవీ డిబేట్లు, మీడియా సమావేశాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రతిపక్షాలను బాగా చులకనగా మాట్లాడారనే ఆరోపణలున్నాయి. మొన్నటి డిసెంబర్ 3వ తేదీన అధికారంలో నుండి బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి పైన చెప్పిన నేతల్లో చాలామంది నోళ్ళు మూతపడిపోయాయి. దాదాపు రెండునెలలుగా వీళ్ళు పెద్దగా ఎక్కడా కనబడటంలేదు. పార్టీలోనూ సైలెంట్ అయిపోయారు, మీడియా ముందుకు కూడా రావటంలేదు.

ఎందుకు వీళ్ళంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారన్నదే అర్ధంకావటంలేదు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం అధికారం ఉందికదాని వీళ్ళల్లో చాలామంది రెచ్చిపోయారు. ఎంతోమంది భూకబ్జాలు, ధౌర్జన్యాలు, రియల్ ఎస్టేట్ మోసాల్లాంటి అనేక అంశాల్లో ఇన్వాల్వ్ అయ్యారట. అవన్నీ ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీస్తోంది. దాంతో తాము ఇపుడు కూడా రెచ్చిపోతే ఎక్కడ ఇరుక్కుంటామో అన్న భయంతోనే అసలు బయటకు రావటమే మానుకున్నారట.

తీసుకున్న అప్పు తీర్చలేదని, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని జీవన్ రెడ్డిపైన కేసులుపడ్డాయి. అజయ్ కుమార్ మీద కూడా ఎన్నో భూకబ్జాల ఆరోపణలున్నాయి. ఇలా ఒక్కోరిపైన ఉన్న ఆరోపణలను విచారించి ప్రభుత్వం కేసులు నమోదుచేస్తోంది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం దృష్టిలో పడటం ఇష్టంలేకే చాలామంది సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారని పార్టీలోనే చర్చ నడుస్తోంది. మరి వీళ్ళంతా స్లీపింగ్ మోడ్ లో నుండి ఎప్పుడు యాక్టివ్ మోడ్ లోకి వస్తారో చూడాలి.