Begin typing your search above and press return to search.

శివకుమార్ పేరెత్తగానే శివాలెత్తిన సిద్దరామయ్య... వీడియో వైరల్!

గతకొన్ని రోజులుగా కర్ణాటక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 July 2025 2:57 PM IST
శివకుమార్  పేరెత్తగానే శివాలెత్తిన సిద్దరామయ్య... వీడియో  వైరల్!
X

గతకొన్ని రోజులుగా కర్ణాటక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పైగా ఇటీవల సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ ఇష్యూ మరింత వైరల్ గా మారింది. ఈ సమయంలో ఆ అసంతృప్తి వ్యవహారం శనివారం మైసూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలోని వేదికపై బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అగ్రనాయకులు వాటిని తోసిపుచ్చుతున్నారు. అది హైకమాండ్ చూసుకుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో డీకే శివకుమార్‌ పేరు ప్రస్తావించాలని సూచించిన వ్యక్తిపై సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు.

వివరాళ్లోకి వెళ్తే... శనివారం మైసూర్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తన ప్రసంగం తర్వాత ముఖ్యమైన పని ఉందని బెంగళూరు బయలుదేరారు.

ఆ తదనంతరం ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చారు సీఎం సిద్ధరామయ్య. ఈ సందర్భంగా వేదికపై ఉన్న ప్రముఖుల గురించి ప్రస్తావించే సమయంలో డిప్యూటీ సీఎం పేరును ప్రస్తావించ లేదు. సరిగ్గా ఈ సమయంలో ఓ వ్యక్తి సీఎం వద్దకు వెళ్లి సైలంట్ గా ఈ విషయాన్ని గుర్తుచేశారు. దీంతో... ఆ వ్యక్తిపై సీఎం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా... 'శివకుమార్‌ ఇక్కడ లేరు కదా? ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు.. వెళ్లిపోయిన వారి గురించి కాదు.. వేదికపై ఉన్న నేతల పేర్లను ప్రస్తావించాలి.. ఇంట్లో కూర్చున్న వారి గురించి కాదు.. ఇక్కడ ఉన్నవారికి ఆహ్వానం పలకాలి.. అదే ప్రొటోకాల్‌' అని అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

కాగా.. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచీ సీఎం సీటు విషయం హాట్ టాపిక్ గానే ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై హస్తిన వేదికగా హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. ఫైనల్ గా సిద్ధరామయ్యను హైకమాండ్‌ ఎంచుకుంది. అయితే, రెండున్నరేళ్ల తర్వాత మార్పు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది!