Begin typing your search above and press return to search.

గోదావరి తీరంలో మరో అన్నా చెల్లి పోరు !

తెలుగు నాట రాజకీయంగా చూస్తే ఒకే రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్యనే విభేదాలు ఎక్కువగా వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 Jun 2025 3:00 AM IST
గోదావరి తీరంలో మరో అన్నా చెల్లి పోరు !
X

తెలుగు నాట రాజకీయంగా చూస్తే ఒకే రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్యనే విభేదాలు ఎక్కువగా వస్తున్నాయి. రాజకీయాల్లో ఇదివరకు వారసులుగా కుమారులే ఉండేవారు. ఇపుడు కుమార్తెలు కూడా రంగంలోకి వస్తున్నారు. తమ వాటా తేల్చుకుంటున్నారు.

దాంతో ఒక దశ వరకూ బాగానే ఉన్నా వ్యవహారం కాస్తా ముదిరాక తోడబుట్టిన వారి మధ్యనే ఆధిపత్యం కోసం అగ్గి రాజుకుంటోంది. అన్నాదమ్ములు ఇద్దరూ రాజకీయ సమరం చేయడం గతంలో జరిగేది. అన్న ఒక పార్టీలో తమ్ముడు వేరే పార్టీలో ఉంటూ రాజకీయం చేసేవారు.

ఇపుడు కాలం మారింది. అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది అది కాస్తా వీధిన పడుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్ళకు దారి తీస్తోంది. తెలునాట కొన్ని ప్రముఖ్య కుటుంబాలలో ఇది సాధారణంగా మారుతోంది. వైఎస్సార్ కుటుంబంలో ఆయన బిడ్డలుగా ఉన్న జగన్ షర్మిల మధ్యన విభేదాలు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు.

కానీ వచ్చాయి. షర్మిల అన్నతో విభేదించారు. 2021లో ఆమె సొంత పార్టీ పెట్టారు. మూడేళ్ళు తిరగకముందే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ పీసీసీ చీఫ్ గా వచ్చి అన్న జగన్ తో డైరెక్ట్ ఫైట్ చేశారు. జగన్ మాజీ సీఎం కావడానికి షర్మిల హ్యాండ్ కూడా ఉందని విశ్లేషణలు ఉన్నాయి.

కట్ చేస్తే ఇటీవలనే తెలంగాణాలో బీఆర్ఎస్ లో కూడా అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ రచ్చ మొదలైంది అని ప్రచారం సాగింది. కేసీఆర్ కుమార్తె కవిత తన తండ్రిని దేవుడు అంటూనే పరోక్షంగా అన్న కేటీఆర్ ని విమర్శిస్తూ వస్తున్నారు అని అంతా భావిస్తున్నారు. కేటీఆర్ కి ఈ రోజు వర్కింగ్ ప్రెసిండెంట్ హోదా పార్టీలో ఉంది. దాంతో ఆయన చేతికే రేపో మాపో పగ్గాలు వెళ్తాయని భావించే కవిత ఇలా రాజకీయంగా అన్నతోనే తేల్చుకుంటున్నారు అని ప్రచరం కూడా ఉంది.

ఇక ఏపీలో చూస్తే గోదావరి తీరంలో మరో అన్నా చెల్లెళ్ళ మధ్య రచ్చ స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఇక్కడ చూస్తే ముద్రగడ పద్మనాభం కుటుంబంలో ఆయన కుమారుడు గిరి కుమార్తె క్రాంతిల మధ్య విభేదాలు ఉన్నాయన్నది క్రాంతి తాజాగా రాసిన ఒక లేఖ ద్వారా బయటపడింది. తన తండ్రికి క్యాన్సర్ ఉందని తెలిసి తాను చూడడానికి వెళ్ళాలనుకుంటే అన్నయ్య అడ్డుకున్నారు అని క్రాంతి బహిరంగంగా రాసిన లేఖ ద్వారా బయటపెట్టారు.

ఇక తన తండ్రికి సరైన వైద్యం చేయించడం లేదని కూడా ఆమె ఆరోపించారు. రాజకీయంగా మనసులో ఉంచుకుని తనకు ఇలా తండ్రికి దూరం చేసే విధంగా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక్కడ చూస్తే ముద్రగడ ముఖ్యమంత్రిగా పని చేయలేదు. మంత్రిగా చేశారు.

కానీ ఆయన ఒక ప్రముఖ నాయకుడిగా కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఈ రోజుకీ ముద్రగడ బ్రాండ్ ఒకటి ఉంది. ఆ బ్రాండ్ కోసమేనా అన్నా చెల్లెలు మధ్య వివాదం సాగుతోంది అన్న చర్చ మొదలైంది. ఇక ముద్రగడ ఆయన కుమారుడు గిరి వైసీపీలో ఉన్నారు గిరి విషయానికి వస్తే ఆయన ఒక నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జి గా ఉన్నారు.

క్రాంతి అయితే 2024 ఎన్నికల ముందు జనసేనలో చేరారు. ఆ విధంగా ఆమె తన రాజకీయ ఆకాంక్షను బయటపెట్టుకున్నారు. ఇక ముద్రగడ వారసుల మధ్య పోరు ఏ వైపునకు దారి తీస్తుంది అని అంతా ఆలోచిస్తున్నారు.

ఏది ఏమైనా ముద్రగడ అంటే అందరికీ అభిమానమే. ఆయనకు ఏమి జరిగింది అన్నది కుమార్తె చెప్పారు. కానీ పూర్తి వివరాలను కుమారుడు విడుదల చేయాలని అంతా కోరుకుంటున్నారు. మరో వైపు చూస్తే అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు సమసి పోవాలని కూడా అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.