Begin typing your search above and press return to search.

దారుణం... భార్యను హత్యచేసి 224 ముక్కలుగా నరికేశాడు!

వివరాళ్లోకి వెళ్తే... నికోలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్ హోం లో ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   8 April 2024 7:30 AM GMT
దారుణం... భార్యను హత్యచేసి  224 ముక్కలుగా నరికేశాడు!
X

అత్యంత దారుణమైన సంఘటన తెరపైకి వచ్చింది. కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త.. ఆమె మృతదేహాన్ని ఏకంగా 224 ముక్కలుగా నరికేశాడు. అత్యంత భయంకరమైన ఈ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెళ్లడిస్తుండగా.. ఒళ్లు గగ్గురుపొడిచేలా పరిస్థితి ఉందని చెప్పారని తెలుస్తోంది! ప్రస్తుతం ఈ విషయం అత్యంత వైరల్ గా మారింది!!

వివరాళ్లోకి వెళ్తే... నికోలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్ హోం లో ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 17 నుంచి తన భార్య బ్రామ్లీ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మెట్సన్. తనను కొట్టి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో... పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో... వారు నివాసం ఉంటున్న ఫ్లాట్ ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు.. ఆ ప్రాంతంలో అతిగా శుభ్రం చేసినట్లుగా బ్లీచింగ్ ఆనవాళ్లూ కనిపించాయంట. దీంతో... మెట్సన్ ను అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టగా... తనకు ఏమీ తెలియదంటూ వాదించాడట మెట్సన్. ఈ సమయంలో పోలీసులకు ఒక సమాచారం అందింది!

ఇందులో భాగంగా... సమీపంలోని విథం నదిలో చేయి సహా చిన్న చిన్న శరీర భాగాలు ఉన్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోతున్నాయని స్థానికుడు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్ల సాయంతో వాటిని సేకరించిన పోలీసులు... ఆ శరీర భాగాలను, ముక్కలను ల్యాబ్ కు పంపించారు.

ఈ సమయంలో ఏమాత్రం గుట్టుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీని పలుమార్లు కత్తితో పోడిచి.. అనంతరం ఆమె శరీరాన్ని సుమారు 224 ముక్కలుగా నరికి నదిలో పడేశాడని పోలీసులు విషయం రాబట్టారట. ఆ సమయంలో ఆమె శరీర భాగాలను పడేయటంలో మెట్సన్ స్నేహితుడు జాషువా హ్యాన్ కాక్ కూడా సహకరించగా.. అతడు తన నేరాన్ని అంగీకరించాడటని తెలుస్తుంది. ఇదే సమయంలో మెట్సన్ కూడా తన నేరాన్ని ఒప్పుకున్నాడని అంటున్నారు.

ఈ సమయంలో... ఆమెను హత్య చేసి సుమారు వారం రోజుల పాటు శరీర ముక్కలున్న బ్యాగులను దాచిన తర్వాత వాటిని పడేశాడని చెబుతున్నారు. ఆమెను హత్య చేసిన అనంతరం ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి 50 పౌడ్లు విత్ డ్రా చేసి వాడుకున్నాడని చెబుతున్నారు.