Begin typing your search above and press return to search.

షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ఆదాయం ఎంతో తెలుసా? మన ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఎంత నష్టం ?

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద వరుసగా కఠిన చర్యలు తీసుకుంటుంది.

By:  Tupaki Desk   |   28 April 2025 8:30 AM
షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ఆదాయం ఎంతో తెలుసా? మన ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఎంత నష్టం ?
X

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద వరుసగా కఠిన చర్యలు తీసుకుంటుంది. సింధు జలాల ఒప్పందం, అట్టారి వాఘా సరిహద్దు నుంచి వాణిజ్యాన్ని నిలిపివేసిన తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తానీలకు చెందిన 16 యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించింది. ఇందులో పాకిస్తానీ జర్నలిస్ట్ ఆర్జూ కాజ్మీ, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌తో సహా పలువురి అకైంట్లను బ్లాక్ అయ్యాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ పాకిస్తానీయుల ఆదాయానికి ప్రధాన వనరులుగా ఉన్నాయి. షోయబ్ అక్తర్‌ను తరచుగా మనదేశం గురించి వ్యాఖ్యలు చేస్తుండడాన్ని చూడవచ్చు.ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ యూట్యూబ్ నుండి ఎంత సంపాదించేవాడు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

షోయబ్ అక్తర్ ఆస్తి ఎంత?

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. ఇతడిని రావల్పిండి ఎక్స్ ప్రెస్ అని పిలుస్తారు. తను క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్ కు పేర్గాంచాడు. మైదానం వెలుపల కూడా తను సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అతని మొత్తం ఆస్తి దాదాపు 15 మిలియన్ డాలర్లు (సుమారు 190 కోట్ల రూపాయలు)గా అంచనా.

క్రికెట్ ద్వారా ఆదాయం

1997 నుంచి 2011 వరకు సాగిన తన క్రికెట్ కెరీర్‌లో అక్తర్ టెస్ట్, వన్డేలలో కలిపి 400కు పైగా వికెట్లను తీశాడు. గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేయడం అతడి ఘనత. ఇదో ప్రపంచ రికార్డు. క్రికెట్ ఆడుతున్న సమయంలో అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి జీతం, మ్యాచ్ ఫీజు, బోనస్ ద్వారా మంచి ఆదాయం పొందాడు.

వ్యాపారం ద్వారా ఆదాయం

క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అక్తర్ కామెంట్రీ, టెలివిజన్ షోస్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదిస్తున్నాడు. అతని యూట్యూబ్ ఛానల్ కూడా చాలా పాపులర్. దీని ద్వారా తనుకు మంచి ఆదాయం లభిస్తుంది. అక్తర్ రియల్ ఎస్టేట్ , రెస్టారెంట్ వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఒక పాడ్‌కాస్ట్‌లో అక్తర్ మాట్లాడుతూ.. తాను అమెరికన్ డాలర్లలో పాకిస్తాన్ మొదటి బిలియనీర్‌గా మారాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

పెన్షన్ ద్వారా ఆదాయం

షోయబ్ అక్తర్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) నుండి ప్రతి నెలా 1,54,000 పాకిస్తాన్ రూపాయలు (సుమారు 48,154 భారతీయ రూపాయలు) పెన్షన్ వస్తుంది. అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కోసం ఈ పెన్షన్ ఇస్తారు. అతను తన చాలా ఆస్తులను క్రికెట్ ద్వారానే సంపాదించాడు. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, టీవీ షోల నుండి కూడా ఆదాయం పొందుతారు.

యూట్యూబ్ ద్వారా ఆదాయం

షోయబ్ యూట్యూబ్‌లో కూడా చురుగ్గా ఉంటాడు. తన ఛానల్ ద్వారా సంపాదిస్తుంటాడు. అతని యూట్యూబ్ ఛానల్‌కు 6.12 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇది అతని ఆదాయాన్ని పెంచడానికి సాయపడుతుంది. వివిధ సోర్సుల ప్రకారం షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ నుండి ప్రతి నెలా దాదాపు $64 నుంచి $388 వరకు సంపాదిస్తాడు. కొన్ని నివేదికలలో అతని నెలవారీ ఆదాయం 325,600డాలర్ల వరకు ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అతని వీడియోలను 420 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించాయి. దీని ద్వారా షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ పాకిస్తాన్‌లో అత్యధికంగా సంపాదించే యూట్యూబ్ ఛానెళ్లలో ఒకటి అని స్పష్టంగా తెలుస్తోంది.