Begin typing your search above and press return to search.

శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్... తెరపైకి ఐఏఎస్ అధికారి పేరు!

అవును... హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ తన కన్ఫెషన్ రిపోర్ట్ లో ఒక ఐఏఎస్ పేరు ప్రస్థావించినట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 11:29 AM GMT
శివబాలకృష్ణ కన్ఫెషన్  రిపోర్ట్... తెరపైకి ఐఏఎస్  అధికారి పేరు!
X

హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నేరాంగీకార పత్రం (కన్ఫెషన్ రిపోర్ట్)లో సంచలన అంశాలు వెలుగుచూశాయి. ఇందులో భాగంగా... ఏసీబీ అధికారుల విచారణ సందర్భంగా ఓ ఐఏఎస్‌ పేరును ప్రస్తావించగా.. బాలకృష్ణ ద్వారా ఆ ఐఏఎస్‌ అధికారి తనకు కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారని వెళ్లడించినట్లు తెలుస్తుంది. దీంతో... ఈ వ్యవహారం ఇప్పుడు మరో టర్న్ తీసుకుందని అంటున్నారు.

అవును... హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ తన కన్ఫెషన్ రిపోర్ట్ లో ఒక ఐఏఎస్ పేరు ప్రస్థావించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... గత ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసి, ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా మంచి పొజిషన్ లో ఉన్న ఐఏఎస్ అధికారి ఒత్తిడితోనే నార్సింగ్ లోని ఓ వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లు చెప్పారని అంటున్నారు. ఆ విధంగా ఐఏఎస్ అధికారి ఆదేశాలతోనే సుమారు 12 ఎకరాల వివాదాస్పద భూమికి శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చారని చెప్పినట్లుగా తెలుస్తుంది.

ఇందులో భాగంగానే ఒక ప్రాజెక్ట్ అనుమతి కోసం సుమారు 10 కోట్ల రూపాయలు సదరు ఐఏఎస్ అధికారి డిమాండ్ చేశారని.. దీనికోసం ముందుగా కోటి రూపాయలు చెల్లించారని వెల్లడించినట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి. ఆ విధంగా కోటి రూపాయలు బాలకృష్ణ ద్వారా ఆ ఐఏఎస్ అధికారి కి చేరాయని పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీనికోసం నేరుగా జూబ్లిహిల్స్ లోని సదరు ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికెళ్లి స్వయంగా తానే డబ్బులు అప్పగించినట్లు బాలకృష్ణ చెప్పారని అంటున్నారు.

ఇదే సమయంలో గిఫ్ట్ గా వెర్టెక్స్ హోంస్ లో ఆ అధికారి పేరిట ఒక ప్లాట్ కూడా రిజిస్టర్ చేశారని చెబుతున్నారు. 2023 డిసెంబరులో బాలకృష్ణ ద్వారా ఆ ఐఏఎస్ కు కోటి రూపాయలు చేరాయని తన కన్ఫెషన్ రిపోర్ట్ లో పేర్కొన్నారని తెలుస్తుంది. దీంతో.. ఈ విషయాలపై ఏసీబీ అధికారులు మరింతలోతుగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారని సమాచారం.