Begin typing your search above and press return to search.

విడాకుల తర్వాత మరో ప్రియురాలితో ధవన్.. వైరల్ పిక్

ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ధావన్ స్వయంగా వెల్లడించారు.

By:  Tupaki Desk   |   1 May 2025 9:37 PM IST
విడాకుల తర్వాత మరో ప్రియురాలితో ధవన్.. వైరల్ పిక్
X

టీమిండియా మాజీ క్రికెటర్, గబ్బర్‌గా అభిమానుల ప్రేమను అందుకునే శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన మాజీ భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న తర్వాత, ధావన్ ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా తాను ప్రేమలో ఉన్నట్లు ధావన్ అఫీషియల్‌గా ప్రకటించారు.

ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ధావన్ స్వయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోలో శిఖర్ ధావన్ సోఫీ షైన్‌తో కలిసి చాలా ఆనందంగా కనిపించారు. ఈ ఫోటోకు ధావన్ ఇచ్చిన క్యాప్షన్ చాలా ప్రత్యేకంగా ఉంది. కేవలం 'నా ప్రేమ' అని క్యాప్షన్ ఇచ్చి, తన ప్రేమాయణాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

గత కొంతకాలంగా సోఫీ షైన్‌తో శిఖర్ ధావన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో, అలాగే కొన్ని ప్రైవేట్ ఈవెంట్లలో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ సమయంలోనే వీరి రిలేషన్‌షిప్‌పై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ధావన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ఆ ఊహాగానాలను నిజం చేసి, వాటికి తెరదించారు.

ఆయేషా ముఖర్జీతో విడాకుల తర్వాత ధావన్ కొంతకాలం ఒంటరిగానే ఉన్నట్లు కనిపించినా, ఇప్పుడు సోఫీ షైన్‌తో కొత్త రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టడం విశేషం. క్రికెట్ మైదానంలో తనదైన శైలిలో దూకుడుగా ఉండే గబ్బర్, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుని, తన అభిమానులకు ఈ శుభవార్తను పంచుకున్నారు. ధావన్ కొత్త జీవితానికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

-అయేషాముఖర్జీతో ధావన్ విడాకులు

టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నారు. 2022 ప్రారంభంలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులోని ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కోర్టు ఆయేషా ముఖర్జీ 'మానసిక క్రూరత్వం' కు పాల్పడినట్లు పేర్కొంటూ, శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు చేసింది. వీరిద్దరికీ జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. జోరావర్ సంరక్షణ విషయంలో కోర్టు తీర్పు శిఖర్ ధావన్‌కు అనుకూలంగా వచ్చింది. ఆయేషా జోరావర్‌ను భారతదేశానికి తీసుకువచ్చి, ధావన్ , అతని కుటుంబంతో కొంతకాలం గడపడానికి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయడంలో ఆయేషా సహకరించడం లేదని ధావన్ కోర్టులో పేర్కొన్నారు.

శిఖర్ ధావన్ - ఆయేషా ముఖర్జీ విడాకుల వ్యవహారం, ముఖ్యంగా కుమారుడు జోరావర్ సంరక్షణకు సంబంధించిన న్యాయ పోరాటం చాలా కాలం పాటు వార్తల్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది.