AI లాంటి అందం.. వినికిడి లేని వింత.. చైనా అమ్మాయి పట్ల విధి ఆడిన నాటకం
షెన్యూ తన ఇన్‌స్టిట్యూట్ ఒక ఈవెంట్‌లో కనిపించినప్పుడు ఆమె ఫోటో వైరల్ అయింది.
By: Tupaki Desk | 1 May 2025 6:00 AM ISTదేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు.. అని కొందరు పెద్దలు చెప్పే మాటలు కొందరిని చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. కోయిలకు మంచి గొంతునిస్తే రంగు మాత్రం నలుపు రంగు ఇచ్చాడు. నెమలికి అందమైన రూపాన్ని ఇచ్చి కర్ణకఠోరమైన గొంతును ఇచ్చాడు. మనిషికి కోరికలు ఇస్తే శాంతిని దూరం చేశాడు.. సన్యాసికి శాంతినిస్తే ప్రపంచాన్ని దూరం చేశాడు. దేవుడు ఎవరికైనా కొన్ని ఇస్తే మరికొందరికి ఇంకొన్ని ఇచ్చాడు. అయితే, పొరుగు దేశానికి చెందిన ఈ అమ్మాయి విషయంలో మాత్రం విధి వక్రీకరించిందనే చెప్పాలి.
సిచువాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న 20 ఏళ్ల షెన్యూ ముఖం, ఫ్యాషన్ సెన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇవి చాలా మందిని ఆమె వైపు ఆకర్షించక తప్పదు. ఈ అమ్మాయి ఫోటోను ఎవరైనా చూస్తే అది ప్రకృతి అద్భుతం అని కాకుండా AI సృష్టించిన కళాఖండం అని అనుకుంటారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందుకే ప్రజలు ఆమె ఫోటోలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. షెన్యూ స్కూల్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ట్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చదువుతోంది.
షెన్యూ తన ఇన్‌స్టిట్యూట్ ఒక ఈవెంట్‌లో కనిపించినప్పుడు ఆమె ఫోటో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఆమె అందాన్ని పొగిడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆ ఈవెంట్ కోసం ఆమె సంప్రదాయ వివాహ దుస్తులు ధరించింది. తన అందాన్ని మరింత పెంచడానికి ఆమె తన జుట్టును విరబోసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేశారు. అయితే చాలా మంది ఈ అమ్మాయి నిజమైనది కాదని, AI క్రియేటివిటీ అన్నారు.
ప్రజలు ఆ అమ్మాయి అందాన్ని ఫేక్ అని అంటారు. కానీ ఈ అమ్మాయి దురదృష్టం ఏమిటంటే ఆమె తన నిజం ఏమిటో చెప్పడానికి కూడా లేదు. ప్రజలు ఆమె అందాన్ని నకిలీ అని భావిస్తున్నారు. కానీ ఆమె తన నిజం మాట్లాడి చెప్పలేదు. ఎందుకంటే ఆమెకు మాట్లాడటానికి నోరు లేదు.. వినడానికి చెవులు లేవు. రెండేళ్ల వయస్సు నుంచే ఆమెకు వినికిడి లేదు. అయితే ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఆమె మేకప్ కారణంగా ప్రజలు ఆమెను AI ద్వారా ట్రీట్ చేసినట్లు భావిస్తున్నారని, వారి కుమార్తె చాలా అందంగా ఉంటుందని చెప్పారు.
