భారత్ లో భారీగా హసీనా కార్యకర్తలు.. లక్షమంది అంటున్న ఆలమ్!
అవును... బంగ్లా మజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత ప్రభుత్వ అడ్వైజర్ మహ్ ఫుజ్ ఆలమ్ సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 2 April 2025 11:14 AM ISTబంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 5న ఆ దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనా.. భారత్ లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిఒందే. ఈ సమయంలో హసీనాపై స్వదేశంలో 100కు పైగా కేసులున్నాయి. ఈ సమయంలో ఆమెపై ఆలమ్ సంచలన ఆరోపణలు చేశారు.
అవును... బంగ్లా మజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత ప్రభుత్వ అడ్వైజర్ మహ్ ఫుజ్ ఆలమ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... ఆమె భారత్ లో కూర్చుని బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని.. అతే కాదు, ఆమె పార్టీకి చెందిన సుమారు లక్ష మంది కార్యకర్తలు భారత్ పారిపోయి ఆశ్రయం పొందుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
హసీనా ప్రభుత్వ హయాంలో అదృశ్యమైనా.. లేదా, ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులతో రంజాన్ సందర్భంగా ఢాకాలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలమ్.. షేక్ హసీనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె తన తల్లితండ్రుల హత్యకు ప్రతీకారంగా పలు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.
ఇదే సమయంలో... 2013-14 మధ్య ఓటు హక్కు కోసం ప్రజలు పోరాడుతున్న సమయంలో భారీగా మిస్సింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయని.. నాడు మిస్సైన వారి ఆచూకీ ఇప్పటివరకూ తెలియరాలేదని.. ఈ విధంగా ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆమె ఎన్నో దారుణాలు చేశారని ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో... అవామీ లీగ్ ను వ్యతిరేకించిన వారిని ఉగ్రవాదులు, మిలిటెంట్లుగా ముద్ర వేశారని.. అనంతరం వారిని కనిపించకుండా చేశారని.. ఇప్పుడు కూడా భారత్ లో కూర్చుని సొంతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో పాటు లక్ష మందికి పైగా అవామీ లీగ్ కార్యకర్తలు ఆ దేశానీకి పారిపోయారని ఆరోపించారు.