ఆడబిడ్డకు “హింద్” పేరు పెట్టిన దుబాయ్ ప్రిన్స్... కీలక వ్యాఖ్యలు!
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ తన నాల్గవ సంతానంగా కుమార్తె జన్మించినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 28 March 2025 6:00 AM ISTదుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ తన నాల్గవ సంతానంగా కుమార్తె జన్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా... కుమార్తె పేరు హింద్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ ముక్తూమ్ అనే పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఈ వార్తను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటూ కీలక విషయాలు వెల్లడించారు.
అవును... దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ తన నాల్గవ సంతానంగా జన్మించిన కుమార్తె విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ... ఓ అల్లాహ్.. ఆమెకు నీ ప్రేమతో నిండిన హృదయాన్ని, నిన్ను స్మరించే నాలుకను ప్రసాదించమని.. నీ వెలుగులో పెంచమని కోరుతూ.. ఆమెకు ఆరోగ్యం, శ్రేయస్సు అనే వస్త్రాలని ధరింపచేయమని రాసుకొచ్చారు.
"హింద్" అనే పేరు షేక్ హమ్దాన్ తల్లి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ భార్య షేఖా హింద్ బింట్ ముక్తౌమ్ గౌరవార్థం పెట్టబడిందని చెబుతున్నారు.
కాగా.. షేక్ హమ్దాన్ 2008 నుంచి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఉప ప్రధానిగా, రక్షణమంత్రిగా పనిచేస్తున్నారు. అంతకంటే ముందు... దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్, షేఖా హింద్ బింట్ ముక్తూమ్ బిన్ జుమా అల్ ముక్తూమ్ ల రెండో కుమారుడు అనే సంగతి తెలిసిందే.
