Begin typing your search above and press return to search.

షరీఫ్ బ్రో ఇలా పెట్టుకోవాలి.. పుతిన్‌ ముందు పాక్ ప్రధాని మరోసారి "కామెడీ షో"

అంతర్జాతీయ వేదికలు అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు, గంభీర చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలు అనుకుంటాం.

By:  Tupaki Desk   |   3 Sept 2025 2:17 PM IST
షరీఫ్ బ్రో ఇలా పెట్టుకోవాలి.. పుతిన్‌ ముందు  పాక్ ప్రధాని  మరోసారి కామెడీ షో
X

అంతర్జాతీయ వేదికలు అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు, గంభీర చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలు అనుకుంటాం. కానీ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ విషయంలో మాత్రం విషయం కొంచెం భిన్నంగా మారుతోంది. ఎందుకంటే ఆయన ప్రతి సారి హైప్రొఫైల్‌ సమావేశానికి హాజరైనప్పుడు, చర్చల కంటే ఎక్కువగా ఇయర్‌ఫోన్‌ ఎపిసోడ్లు ట్రెండ్ అవుతుంటాయి.

సేమ్ సీన్ రిపీట్

2022లో ఉజ్బెకిస్థాన్‌ పర్యటనలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకోవడానికి పడిన ఇబ్బందులు అప్పట్లో ఇంటర్నెట్‌లో జోక్స్‌కు వేదిక అయ్యాయి. ఎవరు ఊహించారు? అదే కథ మళ్లీ రిపీట్‌ అవుతుందని. తాజాగా చైనాలో జరిగిన షాంఘై సహకార సదస్సులో షరీఫ్‌ మరల ఆపసోపాలు పడ్డారు. పక్కనే కూర్చున్న పుతిన్‌ ఇయర్‌ఫోన్‌ సరిగ్గా పెట్టుకుని సిద్ధమయ్యారు. కానీ షరీఫ్‌ మాత్రం ఏం చేయాలో తెలియక చుట్టూ చూసుకోవాల్సి వచ్చింది. చివరికి పుతిన్‌ స్వయంగా “ఇదిగో ఇలా పెట్టుకోవాలి” అని క్లాస్‌ తీసుకోవడం అంతర్జాతీయ సదస్సు కంటే కామెడీ సీన్‌లా మారింది.

మీమర్స్ కు పండగే..

ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. మీమ్‌ మేకర్స్‌ కు పండుగ చేసుకోవడంతో పాటు వారికి చేతినిండా పని దొరికిందనే చెప్పుకోవాలి. ఒకవైపు మోదీ-పుతిన్‌ స్నేహపూర్వకంగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటే, షరీఫ్‌ మాత్రం చేతులు కట్టుకుని దూరం నుంచి చూస్తూ “సైడ్ రోల్”లో నిలబడ్డట్టు కనిపించారు. దాంతో ఆయన పైన “బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్‌” జోక్స్‌ మొదలయ్యాయి.

ఇక అసలు చర్చల విషయానికి వస్తే, పహల్గాం ఉగ్రదాడిని అన్ని దేశాలు ఖండించగా, పాక్‌ మాత్రం మౌనంగా ఉండాల్సి వచ్చింది. అయినా షరీఫ్‌ బయటికి వచ్చి రష్యా-భారత్‌ సంబంధాలను గౌరవిస్తామని, తాము కూడా బలమైన అనుబంధం కోరుకుంటున్నామని చెప్పారు. అంటే ఇయర్‌ఫోన్‌లో ఇబ్బంది పడ్డా, తన సమాధానం సిద్ధంగానే ఉంచుకున్నాడని స్పష్టమైంది.

కానీ ఈ మొత్తం సంఘటనతో మరోసారి నిరూపితమైంది – షరీఫ్‌ ఎక్కడికి వెళ్లినా, సదస్సు ముఖ్యాంశం కంటే ఆయన ఇయర్‌ఫోన్‌ పోరాటమే ఎక్కువగా గుర్తుండిపోతుంది.