Begin typing your search above and press return to search.

టెక్ దిగ్గ‌జాల మ‌ధ్య 'ప‌నిగంట‌ల' వివాదం.. కాంగ్రెస్ నేత స‌ల‌హా ఏంటంటే!

రెండు సంవ‌త్స‌రాల కింద‌టి వ‌ర‌కు.. వ‌ర్క్ ఫ్రం హోం విధానాన్ని అనుస‌రించిన టెక్ సంస్థ‌లు.. ఇప్పుడు మాత్రం ప‌నిగంట‌లు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   28 Nov 2023 3:00 AM GMT
టెక్ దిగ్గ‌జాల మ‌ధ్య ప‌నిగంట‌ల వివాదం.. కాంగ్రెస్ నేత స‌ల‌హా ఏంటంటే!
X

రెండు సంవ‌త్స‌రాల కింద‌టి వ‌ర‌కు.. వ‌ర్క్ ఫ్రం హోం విధానాన్ని అనుస‌రించిన టెక్ సంస్థ‌లు.. ఇప్పుడు మాత్రం ప‌నిగంట‌లు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం, యుద్ధాలు, ద్ర‌వ్యోల‌బ్బ‌ణ ప్ర‌భావంతో ప్ర‌పంచం ప‌నిగంట‌లు పెంచి.. కొత్త ఔట్ పుట్ తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. దీంతో టెక్ సంస్థ‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో రెండు టెక్ దిగ్గ‌జ సంస్త‌లు.. ఇన్పోసిస్ అధినేత నారాయ‌ణ మూర్తి ఒక వాద‌న‌ను తెర‌మీదికి తెస్తే.. మెక్రోసాఫ్ట్ దిగ్గ‌జం.. బిల్ గేట్స్ మ‌రో వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వైరుధ్యం ఏర్ప‌డింది. అయితే.. ఈ వాద‌న మ‌ధ్యంలో ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ శ‌శిథ‌రూర్ మ‌రో ఆస‌క్తికర వ్యాఖ్య చేశారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం.. నెటిజ‌న్ల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది.

నారాయ‌ణ మూర్తి వాద‌న ఇదీ..

ఇన్పోసిస్ అధినేత నారాయ‌ణ మూర్తి.. ప్ర‌స్తుత ప్ర‌పంచంలో నెల‌కొన్న పోటీ వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకునేందుకు యువ‌త‌ వారానికి 70 గంట‌ల‌పాటు ప‌నిచేయాల‌ని సూచించారు. అప్పుడు మాత్ర‌మే టార్గెట్ రీచ్ కాగ‌ల‌మ‌న్నారు. అప్పుడే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలవగలదని వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయాన్ని కొంతమంది సీఈవోలు సమర్థించగా.. చాలా మంది నెటిజన్లు వ్యతిరేకించారు.

బిల్ గేట్స్ అభిప్రాయం ఇదీ..

కృత్రిమ మేధ(ఏఐ)తో పనితీరులో శాశ్వత మార్పులు చోటుచేసుకుంటాయని, వారానికి మూడు పనిదినాలు(24 నుంచి 18 గంట‌లు) స‌రిపోతాయ‌ని అన్నారు. అంతేకాదు.. కొన్నాళ్లకు ఏఐ విస్తృతి పెరుగుతుంద‌ని.. దీంతో మనుషులు కష్టపడాల్సిన అవసరం ఉండని దశకి చేరుకుంటామని తెలిపారు. మొత్తానికి అటునారాయ‌ణ మూర్తి 70 గంటలు అన‌డం.. ఇటుబిల్ గేట్స్ 24 నుంచి 18 గంట‌లు చాల‌ని సూచించ‌డంతో ప‌నిగంట‌ల‌పై కొత్త వివాదం ఏర్ప‌డింది.

శ‌శి సూచ‌న ఏంటంటే..

ఈ వివాదంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్ వేలు పెట్టారు. ''బిల్‌గేట్స్‌, నారాయణమూర్తి కలిసి కూర్చుని ఈ అంశంపై రాజీ కుదుర్చుకుంటే గనుక.. ప్రస్తుతం మనం పాటిస్తున్న వారానికి ఐదు రోజుల పని విధానం దగ్గరకే తిరిగి చేరుకుంటాం'' అని అభిప్రాయపడ్డారు. దీనిపై నెటిజ‌న్లు భిన్న‌మైన అభిప్రాయాలువ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.