Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ పై దాడులతో షారూఖ్ హైఅలెర్ట్

ఇటీవ‌ల సెల‌బ్రిటీల్లో ఆక‌స్మిక టెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఆశ్చర్య‌ప‌రుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ పైనా దీని ప్ర‌భావం క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   18 April 2024 1:55 PM GMT
స‌ల్మాన్ పై దాడులతో షారూఖ్ హైఅలెర్ట్
X

ఇటీవ‌ల సెల‌బ్రిటీల్లో ఆక‌స్మిక టెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఆశ్చర్య‌ప‌రుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ పైనా దీని ప్ర‌భావం క‌నిపిస్తోంది. తాజా టోర్నమెంట్‌లో తన క్రికెట్ జట్టుకు మద్దతుగా నాలుగు రోజులు కోల్‌కతాలో ఉన్న షారుఖ్ ఖాన్, గత రాత్రి మ్యాచ్ అనంత‌రం కోల్ క‌త‌ నుండి బయలుదేరినప్పుడు సాయుధ గార్డులు, పోలీసులు, విమానాశ్రయ భ‌ద్ర‌త‌తో ఎస్కార్ట్ అవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కోల్‌కతా నుండి ఖాన్ బయలుదేరిన దృశ్యాలు చూస్తూ ప్ర‌జ‌ల ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

ఖాన్ గట్టి భద్రతా వ‌ల‌యంలో కనిపించాడు. ఆ స‌న్నివేశం చూశాక‌.. ఇంత‌గా మంది మార్భ‌లం భ‌ద్ర‌తావ‌ల‌యం అవ‌స‌ర‌మా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇటీవల సల్మాన్‌ఖాన్‌ నివాసం వెలుపల కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు అంత‌కంత‌కు తీవ్రమవుతున్న నేపథ్యంలో, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ భద్రతను అమాంతం పెంచార‌ని తెలిసింది.

తాజాగా షారూఖ్‌ అభిమానుల క్లబ్‌లు షేర్ చేసిన వీడియోలలో అత‌డు సాయుధ గార్డుల ఎస్కార్ట్ తో కనిపించాడు, అతడు గత రాత్రి ఆలస్యంగా పొరుగు రాష్ట్రం నుండి బయలుదేరినప్పుడు పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది అత‌డి చుట్టూ మోహ‌రించారు. తన కారులో విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు.. టెర్మినల్‌లోకి ప్రవేశించినప్పుడు సాయుధ గార్డులు, పోలీసులు అత‌డిని ఒక వ‌ల‌యంలా చుట్టుముట్టారు.

అయితే అలాంటి ప‌రిస్థితుల్లో కూడా గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించి అభిమానులు త‌మ ఫేవ‌రెట్ స్టార్‌ని చూడటానికి విమానాశ్రయం వెలుపల గుమిగూడారు. ఖాన్ టెర్మిన‌ల్ నుంచి లోనికి వెళ్లేప్పుడు అల‌లా మీదికి దూసుకొచ్చారు. విమానాశ్రయ భద్రతా ఫుటేజీలో షారూఖ్ సింపుల్ గా ప్రశాంతంగా క‌నిపించాడు. అత‌డు స్కానింగ్ కోసం తన వస్తువులను ట్రేలో ఉంచ‌డం క‌నిపించింది.

గురువారం తెల్లవారుజామున ముంబైకి చేరుకున్న తర్వాత, షారుఖ్ ఖాన్ అప్ప‌టికే వేచి ఉన్న త‌న‌ వాహనం వ‌ద్ద‌కు వెళ్లడానికి ఎంత‌మాత్రం సమయాన్ని వృథా చేయలేదు. ఇది సాధారణ ఎయిర్ పోర్ట్ పికప్ అయినప్పటికీ షారూఖ్ రాక కోసం పార్కింగ్ స్థలంలో అతడి విలాసవంతమైన రోల్స్ రాయిస్ నిరీక్షిస్తూ కనిపించింది. అన్నిచోట్లా అత‌డు చాలా జాగ్ర‌త్త‌ప‌డుతూ క‌నిపించాడు. ఇదంతా అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈడెన్ గార్నెడ్స్‌లో త‌మ టీమ్ ఓట‌మి పాలైనా కానీ, గెలిచిన టీమ్ ని ఖాన్ అభినందించ‌రు. లాకర్ రూమ్‌లో తనవారికి ``ఓడిపోయే అర్హత లేదు`` అని ఖాన్ ఓదార్పును ఇచ్చారు.

ఇక‌పోతే స‌ల్మాన్ ఖాన్ ని అత‌డి కుటుంబాన్ని చంపేస్తామ‌ని బెదిరిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవ‌లే బాంద్రాలోని స‌ల్మాన్ ఇంటి వెలుప‌ల కాల్పుల‌కు పాల్ప‌డ‌డంతో ముంబై హైఅలెర్ట్ అయింది. ఖాన్ ల‌కు గ‌ట్టి భ‌ధ్ర‌త‌ను ఏర్పాటు చేసారు. స‌ల్మాన్ చుట్టూ ఇప్పుడు భ‌ద్ర‌తా వ‌ల‌యం చాలా క‌ఠినంగా ప‌ని చేస్తోంది. అదే స‌మ‌యంలో షారూఖ్ చుట్టూ భ‌ద్ర‌త‌ను పెంచ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స‌ల్మాన్‌ని షూట్ చేస్తే షారూఖ్‌కి భ‌ద్ర‌త దేనికి అన్న డిబేట్ సోష‌ల్ మీడియాల్లో మొద‌లైంది. అయితే దీనిని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ప‌రిగ‌ణించాలి.