Begin typing your search above and press return to search.

'ఆమెను విడుదల చేయండి'... శర్మిష్ఠ కోసం మోడీకి డచ్ ఎంపీ విజ్ఞప్తి!

ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టడంతో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ ని కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Jun 2025 6:16 PM IST
ఆమెను విడుదల చేయండి... శర్మిష్ఠ కోసం మోడీకి డచ్ ఎంపీ విజ్ఞప్తి!
X

ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టడంతో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ ని కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం స్పందించారు. మమతా బెనర్జీ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో డచ్ ఎంపీ ఒకరు స్పందించారు.

అవును... ఆపరేషన్ సిందూర్ సమయంలో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ శర్మిష్ఠ పనోలీ కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో కోల్ కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించే విధంగా ఉందని చెప్పిన వైల్డర్స్... ఆమెను శిక్షించవద్దని కోరారు. ఈ సందర్భంగా... ఎంతో ధైర్యవంతురాలైన ఆమెను విడుదల చేయాలని అధికారులను ఆదేశించాలంటూ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా... ఇదే విషయంపై ఇప్పటికే పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ సమయంలో శర్మిష్ఠ ఓ వీడియో పోస్ట్ చేసిందని.. అయితే తన మాటలు కొంతమందికి బాధ కలిగించేవిగా ఉన్నాయని గ్రహించిన ఆమె దాన్ని తొలగించిందని.. క్షమాపణలు కూడా చెప్పిందని తెలిపారు.

ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు వేగంగా స్పందించి ఆమెను ఆదుపులోకి తీసుకున్నారని అన్నారు. కానీ.. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ కోట్లాది మంది బాధకు కారణమైన అక్కడి నాయకులు, టీఎంసీ ఎంపీల సంగతేమిటి? వారి వ్యాఖ్యలకు క్షమాపణలు ఎక్కడ? వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని పవన్ ప్రశ్నించారు.