Begin typing your search above and press return to search.

షర్మిల నెక్స్ట్ టార్గెట్ ప్రోపర్టీస్ మీద...!?

అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవలు ఏమిటి అన్నది చర్చగా ఉంది. ఎవరికీ ఇది అర్ధం కావడంలేదు. దగ్గర వారు కూడా దీని మీద ఏ సంగతీ చెప్పలేకపోతున్నారు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 2:00 PM GMT
షర్మిల నెక్స్ట్ టార్గెట్ ప్రోపర్టీస్ మీద...!?
X

అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవలు ఏమిటి అన్నది చర్చగా ఉంది. ఎవరికీ ఇది అర్ధం కావడంలేదు. దగ్గర వారు కూడా దీని మీద ఏ సంగతీ చెప్పలేకపోతున్నారు. జగన్ అయితే మౌనంగా ఉంటారు. షర్మిల సైతం ఇంతకాలం మౌనంగా ఉన్నారు. తన అన్నతో గొడవలు ఉంటే తాను ఏపీలోనే పార్టీ పెట్టేదాన్ని కదా అని కూడా షర్మిల తెలంగాణాలో తిరుగుతున్నపుడు అన్నారు. అయితే ఆమె ఏపీకే వచ్చారు. జగన్ నే ఢీ కొట్టారు.

అప్పటి ఆమె మాటలనే తీసుకుంటే అన్నతో కచ్చితంగా గొడవలు ఉన్నాయని అంటున్నారు. అలాగే షర్మిల ఏపీలో అనేక చోట్ల మాట్లాడుతూ తనకు అన్యాయం చేశారు అని కూడా అన్నారు. తాను ఎంతో కష్టపడి తిరిగి వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం అయితే తనను అన్యాయం చేశారు అని అంటున్నారు. ఇక్కడే అయోమయంగా ఉంది. షర్మిలకి అన్యాయం జరిగింది పదవుల విషయంలోనా లేక ఆస్తుల విషయంలోనా అన్నది కూడా తెలియడంలేదు.

అయితే రెండింటిలో అన్నది మాత్రం ఇపుడు మెల్లగా బయటకు వస్తోంది. ఆమె పదవులు ఆశించారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆమె దాన్ని ఖండించి ఉండొచ్చు కానీ ఇపుడు ఆమె ఆస్తుల విషయం కూడా ప్రస్తావిస్తున్నారు. తాజాగా కడపలో ఆమె కాంగ్రెస్ కార్యకర్తలతో జరిగిన సభలో మాట్లాడుతూ సాక్షి మీడియా సంస్థలో కూడా తనకు భాగం ఉందని సంచలన కామెంట్స్ చేశారు.

ఒక విధంగా చూస్తే సాక్షి ఎపుడూ షర్మిలకు పెద్ద పీట వేయలేదు. ఆమె 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున మాట్లాడినపుడు మాత్రమే ఆమెని ఆకాశానికి ఎత్తింది. ఆ తరువాత నుంచి జగన్ తో ఆమెకు విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. నాటి నుంచి సాక్షిలో షర్మిలకు ప్రయారిటీ లేకుండా పోయింది. ఇదే విషయం ఆమె ప్రస్తావిస్తూ తనకూ వాటాలు ఉన్నాయని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. అది కూడా కడప గడ్డ మీద నుంచి ఆమె ఈ ప్రకటన చేశారు.

ఇది ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. ఇదే ఇపుడు కాంగ్రెస్ శ్రేణులు కూడా అంటున్నాయి. షర్మిలకు కూడా సాక్షిలో భాగం ఉందని వారు గట్టిగా చెబుతున్నారు. అదే నిజం అని షర్మిల కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అలాంతి సాక్షిలో షర్మిలకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మీద కూడా ఆమెతో పాటు కాంగ్రెస్ శ్రేణులు మండుతున్నాయి.

ఇక సాక్షి గురించి చెబుతూ తన వాటా అని మొదలెట్టిన షర్మిల నెక్స్ట్ టార్గెట్ తన ఆస్తుల గురించే అని అంటున్నారు. అసలు రానున్న రోజులలో చేసే ప్రకటనలు అన్నీ కూడా తన ఆస్తులు ఎన్ని ఉన్నాయి వాటి విషయంలో ఏమిటి వివాదాలు అన్నది కూడా చెబుతూ వివాదాన్ని మరింతగా పెంచి పెద్దది చేస్తారు అని అంటున్నారు. దీని మీద ఇపుడు సోషల్ మీడియలో కూడా సెటైర్లు పడుతున్నాయి.

షర్మిల ఇప్పటిదాకా చేసిన ప్రసంగాలు ఒక ఎత్తు ఇక మీదట ఆమె ప్రాపర్టీస్ మీదనే తన ఫోకస్ పెట్టి మరీ జగన్ని టార్గెట్ చేస్తుంది అని అంటున్నారు నెటిజన్లు. ఈ విధంగా ఆమె చేయడానికి కూడా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె చూస్తే ఒక మహిళ. ఆమె ఆస్తులు ఆమెకు కాకుండా చేశారు అంటే కచ్చితంగా అది లేడీస్ లో సెంటిమెంట్ కిందకు వస్తుంది.

అందుకే ఆమె ఈ టర్న్ తీసుకుంటారు అని అంటున్నారు. అలా షర్మిల జనంలోకి వెళ్ళి తన తండ్రి ఆస్తులు ఇద్దరి పేరున సమానంగా చేస్తే వాటిని తనకు అన్న జగన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడం ద్వారా మొత్తం మహిళా లోకాన్ని తన వైపు తిప్పుకునే ప్లాన్ వేస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. రానున్న రోజులలో ఇదే జరిగేలా ఉంది అని అంటున్నారు.

అంతే కాదు కడప మీటింగులో షర్మిల సాక్షి మీడియా గురించి కొత్త విషయాలు చెప్పారు. జగన్ తో సమానంగా తనకు కూడా సగం వాటా ఉందని ఆమె చెప్పారు. తన తండ్రి వైఎస్సార్ సాక్షిలో జగన్ కు, తనకు సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు. అదే సాక్షిలో తనకు యాంటీగా ఇపుడు కధనాలు వస్తునాయని ఆమె విమర్శించడంవిశెషం.

ఇక తాను కడప తాను పుట్టిన ఇల్లు అని షర్మిల అన్నారు. జగన్ మాదిరి తాను కూడా ఒక్కడే పుట్టానని, జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని చెప్పారు. మొత్తానికి షర్మిల వ్యవహారం చూస్తే జగన్ మీద కత్తి కట్టి యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఇది రోజురోజుకూ సరికొత్త మలుపు తీసుకోవడం కూడా విశేషం.