Begin typing your search above and press return to search.

పులివెందుల నుంచి షర్మిల...జగన్ తో డైరెక్ట్ గానే...?

ఎపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పులివెందుల నుంచి పోటీ చేయడానికే డిసైడ్ అయ్యారా అంటే ప్రచారం మాత్రం అదే స్థాయిలో ఉంది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 1:30 AM GMT
పులివెందుల నుంచి షర్మిల...జగన్ తో డైరెక్ట్ గానే...?
X

ఎపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పులివెందుల నుంచి పోటీ చేయడానికే డిసైడ్ అయ్యారా అంటే ప్రచారం మాత్రం అదే స్థాయిలో ఉంది. కడప నా అడ్డా అంటూ అక్కడి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రకటించిన షర్మిల తనకూ జగన్ తో సమానంగా అన్ని హక్కులూ ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు. తాను కూడా జగన్ మాదిరిగానే జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టాను అని ఆమె చెప్పుకున్నారు.

తనకు కడప పుట్టినిల్లు అని ఆమె అంటున్నారు. దాంతో పాటు పుట్టిన ఇంటి నుంచే జగన్ కి ఆమె సవాల్ విసురుతున్నారు అని అంటున్నారు. షర్మిల ఈసారికి పులివెందుల నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆమెకు అదే సరైన పోటీ క్షేత్రం అని కాంగ్రెస్ పార్టీ కూడా అంటోందిట.

కడప జిల్లాలో పర్యటించిన షర్మిల స్థానికంగా పార్టీని బలోపేతం చేసే విషయం చర్చించారు అని అంటున్నారు. కడప ఎంపీ సీటు విషయంలో వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ కానీ లేదా వివేకా ఏకైక కుమార్తె సునీత కానీ పోటీ చేయవచ్చు అని అంటున్నారు. సునీత వైపు షర్మిల మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

అక్కడ ఎటూ వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయనతోనే సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. తన తండ్రిని చంపించారు అన్న దాని మీద ఆమె సీబీఐ విచారణ చేయిస్తూ అవినాష్ కుటుంబం మీద గత అయిదేళ్ళుగా అతి పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఇపుడు చూస్తే రాజకీయంగా తేల్చుకునేందుకు కూడా సునీత సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

పోటీకి సిద్ధపడాలని అన్ని విషయాలను తాను చూసుకుంటాను అని వైఎస్ షర్మిల చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే కడప ఎంపీ సీటుకు అక్క సునీత తమ్ముడు అవినాష్ రెడ్డితో తలపడితే ఇక్కడ పులివెందుల నుంచి అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనే చెల్లెలు షర్మిల ఢీ కొడతారు అని కడప జిల్లా వార్తలను బట్టి తెలుస్తోంది.

ఇక కడప అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి అహ్మదుల్లా పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో వైపు చూస్తే బద్వేల్ నుంచి టీడీపీ తరఫున 2014లో పోటీ చేసిన జ్యోతి అనే నాయకురాలు షర్మిల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దాంతో ఆమెకు అక్కడ నుంచి టికెట్ ఇస్తారని అంటున్నారు.

మైదుకూరు అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. షర్మిల ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా కలసి వచ్చారు అయితే ఆయన తన నిర్ణయం ఏదీ చెప్పలేదని అంటున్నారు. తాను ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత ఏ సంగతీ చెబుతాను అని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా బలమైన అభ్యర్ధుల వేటలో కాంగ్రెస్ ఉంది. షర్మిల అయితే అన్ని చోట్ల వైసీపీ అసంతృప్తులతో మాట్లాడుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈసారి కడప రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందో ఏమిటో అన్నది.