Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి షర్మిళ ఓకే..? ఇమిడియెట్ టాస్క్ ఇదే?

దక్షిణాదిలో అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తదుపరి మరో దక్షిణాది కీలక రాష్ట్రం ఏపీలో ప్రభావం చూపించాలని పరితపిస్తుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 8:50 AM GMT
ఏపీ కాంగ్రెస్  చీఫ్  పదవికి షర్మిళ ఓకే..? ఇమిడియెట్  టాస్క్  ఇదే?
X

దక్షిణాదిలో అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తదుపరి మరో దక్షిణాది కీలక రాష్ట్రం ఏపీలో ప్రభావం చూపించాలని పరితపిస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో కాంగ్రెస్ కు అత్యంత వైభవం తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికే ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తుందని అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా షర్మిళ అందుకు అంగీకరిస్తున్నారనే కథనాలు వెలువడుతున్నాయి.

అవును... కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభావం చూపించాలని ఆలోచిస్తుందని, ఇందుకోసం ఆ బాధ్యతను వైఎస్ షర్మిళకు అప్పగించారని అంటున్నారు. ఈ సమయంలో ఒక కీలక విషయం తెరపైకి వస్తుంది. ఇందులో భాగంగా... ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసుకునే బాధ్యతను స్వీకరించడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎట్టకేలకు ఆ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది.

అయితే అందుకు బలమైన కారణం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తొలినుంచీ తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిళ రాకను రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారనే చర్చ నడుస్తుంది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణలో తన పాత్ర ప్రస్తుతానికి ఏమీ లేదని.. ఈ సమయంలో తన రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా ఉండటం కోసం ఏపీలో ఎంటరవ్వాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా... తన పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసి.. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని మరోసారి హైకమాండ్‌ చేసిన తాజా ప్రతిపాదనకు షర్మిళ అంగీకరించినట్లు సమాచారం. వాస్తవానికి ఈ ప్రతిపాదనకు ముందు వైఎస్ షర్మిళకు కాంగ్రెస్ అధిష్టాణం మరో ప్రతిపాదన చేసిందని చెబుతున్నారు. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పావులు కదిపారని అంటున్నారు.

ఇందులో భాగంగా ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తానని పార్టీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే అందుకు ఆమె ఏమాత్రం అంగీకారం తెలపలేదని అంటున్నారు. దీంతో.. ఈ తాజా ప్రతిపాదనకు ఆమె అంగీకారం తెలిపారని... అందులో భాగంగా ఫస్ట్ టాస్క్ గా ఏపీలో రెండు భారీ సభలు నిర్వహించేలా అధిష్టాణం అప్పగించిన బాధ్యతను ఆమె స్వీకరించారని చెబుతున్నారు!

ఇందులో ప్రధానంగా "విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా భారీ ర్యాలీ, అనంతరం భారీ బహిరంగ సభకు షర్మిళ నేతృత్వం వహించబోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆ ర్యాలీలో పాల్గొనడంతో పాటు.. విశాఖలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారని చెబుతున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇదే సమయంలో అమరావతిలో ఏపీ రాజధాని, ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశాలే ప్రాతిపధికగా కాంగ్రెస్ మరో ర్యాలీ కం బహిరంగ సభ నిర్వహించబోతుందని.. ఈ బాధ్యత కూడా షర్మిళకు అప్పగించారని అంటున్నారు. అయితే... ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని, అనంతరం అమరావతి వేధికగా జరిగే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని చెబుతున్నారు. దీంతో ఇకపై ఏపీ కాంగ్రెస్ లో షర్మిళ క్రియాశీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు!