Begin typing your search above and press return to search.

షర్మిలకు తొలి ఝలక్ మాజీ మంత్రి నుంచే ...!?

అలా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు ఆమె ఫోన్ చేసి తనను కలవాలని కోరారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   5 Jan 2024 4:14 AM GMT
షర్మిలకు తొలి ఝలక్ మాజీ మంత్రి నుంచే   ...!?
X

తెలంగాణా కోడలిని అక్కడే రాజకీయాలు చేస్తాను అక్కడే తన రాజకీయ జీవితం అంకితం అంటూ ఎన్నో గంభీర ప్రకటనలు చేసిన వైఎస్ షర్మిల ఇపుడు అక్కడ గడ్డ మీద పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే అతి పెద్ద విజయంగా భావించినట్లున్నారు అని సెటైర్లు పడుతున్నాయి.

పార్టీ పెట్టి ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయకుండా మూసేసిన ఘనతను సైతం ఆమె మూటకట్టుకున్నారు. ఇపుడు ఏపీలో కాంగ్రెస్ ని లేపే బాధ్యతను సంబరంగా నెత్తికెత్తుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పాతాళం లోతుల్లో పాతిపెట్టబడి ఉంది. అలాంటి కాంగ్రెస్ కి తాను పునరుజ్జీవం చేస్తాను అని షర్మిల అనుకుంటున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి.

కాంగ్రెస్ లో షర్మిల చేరారు. ఆమెకు ఇంకా పదవి ఏదీ ఇవ్వలేదు. ఇంతలోనే ఆమె డ్యూటీలోకి దిగిపోయారు. కాంగ్రెస్ ని ఏపీలో అధికారం తెచ్చేస్తామన్న ఉత్సాహంతో ఆమె ఉన్నారు అంటున్నారు. అందుకే ఆమె అర్జంటుగా కొన్ని ఫోన్ నంబర్లు దగ్గర పెట్టుకుని కీలక నేతలతో మాట్లాడుతున్నారు అని తెలుస్తోంది.

తన తండ్రి వైఎస్సార్ కాలం నాటి నాయకులను ఫోన్ ద్వారా పలకరిస్తూ కాంగ్రెస్ ఏపీలో ఉంది చేరండి అని ఆమె పిలుపులు మొదలెట్టారని అంటున్నారు. అలా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు ఆమె ఫోన్ చేసి తనను కలవాలని కోరారని అంటున్నారు.

అయితే దానికి కొణతాల నుంచి భిన్నంగా సమాధానం వచ్చింది అని అంటున్నారు. తన బంధం అనుబంధం అంతా వైఎస్సార్ తోనే అని ఆయనతోనే తనకు అంతా ముగిసింది అని బదులిచ్చి ఒక నమస్కారం పెట్టేశారు అని అంటున్నారు. అలా పెద్దాయన నుంచి తొలి ఫోన్ కే షర్మిలకు నెగిటివ్ ఆన్సర్ రావడం అపశకునమే అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ లో ఉన్న నాయకులే ఉత్సాహంగా ఎక్కడా లేరు. వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అలాంటిది సొంతంగా కాంగ్రెస్ రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తే నోటాతో పోటీ అని వారు భావించి తప్పుకుంటారు అని అంటున్నారు. అయితే పొత్తులు ఉంటే కొందరు నేతలు టికెట్ కోసం చూసే చాన్స్ ఉందని అంటున్నారు.

అయితే ఏపీలో కాంగ్రెస్ తో తెరచాటు పొత్తే తప్ప నేరుగా పొత్తుకు టీడీపీ కూడా ముందుకు రాదు అని అంటున్నారు. అదే టీడీపీ అధినాయకత్వం రాజకీయ చాణక్యం అంటున్నారు. ఇలా కాంగ్రెస్ కి తెర వెనక కన్ను గీటుతూ తెర ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని రేపటి కేంద్ర రాజకీయాలలో అప్పటి పరిస్థితి బట్టి చక్రం తిప్పాలన్నది టీడీపీ పెద్దల ఆలోచన అని అంటున్నారు.

దాంతో కాంగ్రెస్ కి పొత్తులు కమ్యూనిస్టులతోనే ఉంటాయి. అలాగైతే ఏమీ లాభం లేదని కూడా చాలా మంది భావిస్తారు. ఇదీ ఏపీలో కాంగ్రెస్ అసలు మాటర్. అయితే దిగితే కానీ లోతు తెలియదు అన్నది ఒక సామెత ఉంది. అలాగే కాంగ్రెస్ లో కొత్త పెత్తందారుగా షర్మిలకు కూడా కొత్త ఉత్సాహం ఉంటుంది అని అంటున్నారు.

కానీ వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కానీ మరొకరు కానీ గెలుపు గుర్రాల మీదనే పందెం కాస్తారు తప్ప గుడ్డి గుర్రం మీద కాదు అన్న సంగతి కాంగ్రెస్ నేతలకు తొందర్లోనే అర్ధం అవుతుంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ లేదా టీడీపీ శిబిరం రెండే ఉన్నాయి. వైసీపీ అధినాయకత్వం టికెట్లు నిరాకరించిన వారికి హామీ ఇస్తోంది. మరోమారు అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని చెబుతోంది.

కాదని టీడీపీలోకి వెళ్ళినా అవే హామీలు ఉంటాయి. ఈ రెండు పార్టీలే రేపటి రోజున అధికారంలోకి రావడానికి చాన్స్ ఉంది. పోయి పోయి కాంగ్రెస్ తో తల గోక్కునే బాపతు ఉంటారా అన్నదే చర్చ. అయితే వైసీపీ మీద కన్నేసిన కాంగ్రెస్ పెద్దలు షర్మిల చేతికి అసంతృప్త ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చారని అంటున్నారు. మరి ఆమె మాట విని ఎంత మంది ముందుకు వస్తారు ఎంతమంది పార్టీలో చేరుతారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.