Begin typing your search above and press return to search.

సజ్జలకు కౌంటర్ ఇచ్చిన షర్మిల!

ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ముందు మీ కధ ఏంటో చూసుకోండి సజ్జల గారూ అని కౌంటర్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 9:29 AM GMT
సజ్జలకు కౌంటర్ ఇచ్చిన షర్మిల!
X

వైసీపీకి పెద్ద దిక్కుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి ఉన్నారు. ఆయన ప్రతీ విషయం మీద మాట్లాడుతారు. అలా ఆయన వైఎస్సార్టీపీ కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించడం మీద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం తప్పు అన్నట్లుగా మాట్లాడుతూనే అది షర్మిల పార్టీ ఇష్టం అని అన్నారు.

దానికి వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గట్టి కౌంటరే ఇచ్చారు. సోమవారం ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మీడియా మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చామో వివరించారు. ప్రజల కోసమే తెలంగాణా ఎన్నికల్లో పాల్గొనకుండా ఉన్నామని చెప్పుకొచ్చారు.

అంతే తప్ప ఎవరో తమను పొగడాలని కిరీటాలు పెట్టాలని ఎక్కడా కోరుకోవడం లేదని అన్నారు. తెలంగాణా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసుని కొట్టివేసేందుకు సుప్రీం కోర్టులో అంగీకరించలేదని గుర్తు చేశారు. అన్ని పార్టీలలో దొంగలు ఉంటారని, కానీ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు అన్నదే తమ ప్రయత్నం అని షర్మిల ఘాటైన కామెంట్స్ చేశారు.

ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ముందు మీ కధ ఏంటో చూసుకోండి సజ్జల గారూ అని కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్టీపీతో సంబంధం లేదని గతంలో ఇదే సజ్జల అన్నారని ఇపుడు తమ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల నిలదీశారు.

తమ వరకూ వైసీపీతో వైఎస్సార్టీపీకి ఎలాంటి సంబంధం లేదని షర్మిల స్పష్టంగా చెప్పేశారు. అంటే తన అన్న పార్టీ వైసీపీ అయినా తన పార్టీ రాజకీయం తన రాజకీయ విధానాలు వేరు అని ఆమె చెబుతున్నారన్న మాట. ఇక తమతో సంబంధాలు ఏమిటి అన్నవి వైసీపీ ముఖ్య నేత సజ్జల రామక్రిష్ణారెడ్డే వివరణ ఇస్తూ సమాధానాలు చెప్పాలని ఆమె అనడమూ విశేషం.

మరో వైపు చూస్తే ఏపీలో రోడ్లు బాగులేవని, విద్యుత్ లేదని అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ చేసిన విమర్శలకు సజ్జల సమాధానం చెప్పాలని షర్మిల అనడం గమనార్హం. తెలంగాణా సీఎం చేసిన విమర్శలకు ఏమి జవాబు చెబుతారు సజ్జల గారూ అని ఆమె సెటైర్లు వేశారు. అందువల్ల మీ కధ ఏంటో మీరు చూసుకోండి అని షర్మిల చెప్పేశారు. అంటే తన పార్టీ తన ఇష్టం, తన జోలికి రావద్దు అని చాలా ఘాటుగానే షర్మిల రిప్లై ఇచ్చినట్లుగానే ఉంది. దీని మీద సజ్జల ఏలా రియాక్ట్ అవుతారో చూడాలి.