Begin typing your search above and press return to search.

ప్రోగ్రస్ కార్డ్ అడుగుతున్న షర్మిళ... సాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం!

అవును... సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయంగా తమకు అందివచ్చిన, కలిసివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకునేందుకు షర్మిళ సిద్ధంగా లేనట్లే కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:10 AM GMT
ప్రోగ్రస్  కార్డ్  అడుగుతున్న షర్మిళ... సాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం!
X

సబ్జెక్ట్ ఏదైనా, సందర్భం మరేదైనా.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, విమర్శించడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే కనిపించడం లేదు వైఎస్ షర్మిళ. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇప్పుడు ఏపీలో ఆమె ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లుగా ఉంది వ్యవహారం. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఆ పనిలో బిజీగా ఉన్న షర్మిళ... రోజు రోజుకీ డోస్ పెంచుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్సాయిరెడ్డి ట్వీట్ పై స్పందించారు.

అవును... సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయంగా తమకు అందివచ్చిన, కలిసివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకునేందుకు షర్మిళ సిద్ధంగా లేనట్లే కనిపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తగ్గినా.. పవన్ సైలంట్ గా ఉన్నా.. షర్మిళ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా... తాజాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అంశాలపైనా షర్మిళ స్పందించారు.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి.. తమ ముందుకు వచ్చిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదల్ని ఆమోదించింది. దీంతో... ఈ అంశాలను ప్రస్థావిస్తూ... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇది తమ ప్రభుత్వం గొప్పతనం అన్నట్లుగా సగర్వంగా స్పందించారు. దీనికి షర్మిల ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా పలు ప్రశ్నలు సంధించారు!

ఈ క్రమంలో ట్వీట్ చేసిన సాయిరెడ్డి... "సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు.. 5,300 ఉద్యోగాల కల్పనతో ఉజ్వల భవిష్యత్తును వాగ్దానం చేస్తూ.. ఇంధన పరిశ్రమలు స్దాపించేందుకు రూ.22,302 కోట్ల ప్రతిపాదనల్ని ఆమోదించింది. ప్రతిపక్షం తన నెగెటివ్ ప్రచారాన్ని కొనసాగించుకోవచ్చు.. తాము తమ మంచి పనుల్ని కొనసాగిస్తాము!" అని పేర్కొన్నారు. దీనిపై షర్మిళ పలు ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... "అయితే, వీటిలో ఎన్ని వైజాగ్ సమ్మిట్ నుండి వచ్చాయి? సమ్మిట్‌ లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రోగ్రెస్ కార్డ్‌ తో రాగలదా? అలాగే మీ హయాంలో పారిపోయిన పెట్టుబడుల గురించి అందరికీ చెప్పండి? వాస్తవానికి, దావోస్‌ లో ఇంతకుముందు సంతకం చేసిన 1.25 లక్షల కోట్ల పెట్టుబడుల పరిస్థితి ఏమిటి? మీ ప్రభుత్వం ఈ సంవత్సరం దావోస్‌ ను ఎందుకు దాటవేయాలని నిర్ణయించుకుంది!" అని షర్మిళ ట్వీట్ చేశారు.

దీంతో... ఆఫ్ లైన్ అయినా, ఆన్ లైన్ అయినా.. షర్మిళ వర్సెస్ వైసీపీ అనే ఇష్యూ ఎన్నికలయ్యేవరకూ రోజు రోజుకీ హీటెక్కిపోతూ రసవత్తరంగా మారబోతుందనేది మాత్రం ఈ విషయంతో స్పష్టమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!! మరి ఈ ట్వీట్ పై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి!