Begin typing your search above and press return to search.

కడపలో షర్మిల చీల్చే ఓట్లు టీడీపీవే...!?

కడపలో ఈసారి భీకరమైన పోరు సాగనుంది. సడెన్ గా సీన్ లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   8 April 2024 3:50 AM GMT
కడపలో షర్మిల చీల్చే ఓట్లు టీడీపీవే...!?
X

కడపలో ఈసారి భీకరమైన పోరు సాగనుంది. సడెన్ గా సీన్ లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టుకుని అక్కడే రాజకీయం చేస్తూ వస్తున్నారు. అటువంటిది ఆమె ఏపీకి షిఫ్ట్ అవడం ఒక ఎత్తు అయితే ఆమె కడప నుంచే పోటీకి దిగాలనుకోవడం సంచలన పరిణామం.

అయితే వైఎస్ కుటుంబంలో చీలిక రావడం వల్ల వైసీపీ ఓట్లు తగ్గిపోతాయని ఫలితంగా వైసీపీ ఓటమి చెందుతుందని టీడీపీ ఇప్పటిదాకా భావిస్తూ వచ్చింది. కానీ ఇపుడు జరుగుతున్నది వేరుగా ఉంది. అదెలా అంటే షర్మిల కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. కడపలో చూస్తే టీడీపీ 1983లో తప్ప మళ్లీ గెలిచింది లేదు.

అలాంటి సీటులో టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా భూపేష్ రెడ్డిని ప్రకటించింది అని అంటున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడమే మొదటిసారి అనుకుంటే ఆయన జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ అడిగితే ఎంపీగా పంపిస్తున్నారు. దాంతో టీడీపీలో అయితే దీని మీద అసంతృప్తి ఉంది.

ఇంకో వైపు టీడీపీకి కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపుగా నాలుగు లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఇపుడు చూస్తే వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ తమ్ముళ్ళకు ఉంది. కానీ భూపేష్ రెడ్డి అభ్యర్ధిత్వం మీదనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో వారంతా షర్మిల వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

నిజానికి చూస్తే షర్మిల వైసీపీ ఓట్లు చీలుస్తుందన్నది ఒక అంచనా. కానీ వైఎస్సార్ వారసుడిగా జగన్ వైపే ఆయన అభిమానులు కానీ అనుచరులు కానీ ఉంటారు. పైగా షర్మిల టీడీపీ అధినాయకత్వాన్ని ఏమీ అనకుండా జగన్ ని తీవ్ర స్థాయిలో వమర్శించడంతో ఆమె గురించిన వార్తలు టీడీపీ అనుకూల మీడియాలో రావడం ఆమెకు మద్దతుగా పులివెందుల టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి వంటి వారు మాట్లాడడం కడప జనాలు చూస్తున్నారు. అలాగే వైసీపీ మద్దతు దారులు కూడా గమనిస్తున్నారు.

మరో వైపు చూస్తే గత నెలలో నిర్వహించిన వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమానికి టీడీపీ నేతలే వేదిక మీద షర్మిలతో కనిపించారు. ఈ మొత్తం చూసిన తరువాత వైసీపీ అభిమానులు షర్మిలకు ఓటు వేయరనే అంటున్నారు. వారంతా వైసీపీకి కట్టుబడిపోతారని అంటున్నారు.

ఇక ఇపుడు వైసీపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ నుంచే ఓట్లు భారీగా చీలిక వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ వర్సెస్ షర్మిల అన్నట్లుగా కడప ఎంపీ ఎన్నిక మారితే టీడీపీ ఓటు కచ్చితంగా షర్మిల వైపే టర్న్ తిరుగుతుంది అని అంటున్నారు. అపుడు కడప ఎంపీ సీటులో టీడీపీ పొజిషన్ థర్డ్ ప్లేస్ కి వచ్చినా రావచ్చు అని అంటున్నారు.

దీంతోనే ఇపుడు టీడీపీ పెద్దలు కలవరపడుతున్నారు అని అంటున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ ఓడినా సెకండ్ ప్లేస్ టీడీపీదే కడపలో ఉండేది. ఇపుడు అలా కాకుండా మూడవ ప్లేస్ కి మారిపోతే ఆ ప్రభావం కేవలం కడపకే పరిమితం కాదని మిగిలిన చోట్ల కూడా ఉంటుందని చివరికి పుట్టె మునుగుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని పాత ప్రచారాన్ని కొత్తగా ప్రారంభించారు అని అంటున్నారు. అయితే దీని కంటే ముందు కడపలో టీడీపీ బలమైన అభ్యర్ధిని పెట్టాలని అంటున్నారు.

అదే జరిగితే ఓట్లు చీలి వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని వ్యూహంతో టీడీపీ ఉందిట. మొత్తానికి టీడీపీకి ఇపుడు షర్మిల రాజకీయం ఏమిటో అర్ధం కావడం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. టీడీపీ ఏ వ్యూహాలను అమలు చేస్తుందో.