Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నుంచి 82 కోట్లు, భార‌తి నుంచి 19 ల‌క్ష‌లు అప్పు తీసుకున్న ష‌ర్మిల‌!

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, విధానాల‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించ‌డమే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా.. సీఎం జ‌గ‌న్‌ను ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 April 2024 1:10 PM GMT
జ‌గ‌న్ నుంచి 82 కోట్లు, భార‌తి నుంచి 19 ల‌క్ష‌లు అప్పు తీసుకున్న ష‌ర్మిల‌!
X

ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. అన్నా చెల్లెళ్ల‌న్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అన్న ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేయాల‌ని ష‌ర్మిల కృత నిశ్చ‌యంతో దూసుకుపోతున్నారు. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు సైతం గుప్పిస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, విధానాల‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించ‌డమే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా.. సీఎం జ‌గ‌న్‌ను ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఇదంతా గ‌మ‌నిస్తున్న వారు.. వీరిద్ద‌రి మ‌ధ్య ఆస్తుల వివాదాలు ఉన్నాయ‌ని.. సీఎం జ‌గ‌న్ ఆస్తులు పంచ‌కుండా ష‌ర్మిల‌ను వేధిస్తున్నార‌ని.. చ‌ర్చించుకుంటున్న విష‌యం తెలిసిందే.

అయితే.. తాజాగా ఏపీసీసీచీఫ్ ష‌ర్మిల‌.. క‌డప పార్ల‌మెంటు స్థానానికి నామినేష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న‌కు ఉన్న అప్పులు, ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో ఎన్నిక‌ల సంఘానికి వివ‌రించారు. దీనిలో చాలా ఆస‌క్తికర‌ విష‌యాల‌ను ఆమె వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. త‌న ఆస్తుల‌ను రూ.182 కోట్లుగా పేర్కొన్న ష‌ర్మిల‌.. ఇదే స‌మ‌యంలో త‌న అప్పుల‌ను కూడా వివ‌రించారు. త‌న‌కు మొత్తంగా 82 కోట్ల‌, 77 ల‌క్ష‌ల‌, 71 వెయ్యి 682 రూపాయ‌ల అప్పు ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. అయితే.. ఇదేమీ బ‌య‌టి వారి నుంచి తీసుకున్న‌ట్టు చెప్ప‌లేదు.

త‌న తోబుట్టువు.. సీఎం జ‌గ‌న్ నుంచి 82 కోట్ల, 58ల‌క్ష‌ల‌,15 వేల‌ను అప్పుగా తీసుకున్నారు. అదేవిధంగా త‌న వ‌దిన, సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి నుంచి 19ల‌క్ష‌ల‌, 56 వేల, 682 రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకున్న‌ట్టు అఫిడ‌విట్‌లో వివ‌రించారు. మొత్తంగా జ‌గ‌న్ దంప‌తుల‌కు వైఎస్ ష‌ర్మిల రూ.82 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే అప్పు ప‌డ్డారు. అయితే.. ఇదంతా వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం తీసుకున్న‌ట్టు ష‌ర్మిల‌వివ‌రించారు.ఈ ప‌రిణామం.. తాజాగా జ‌రుగుతున్న ఆస్తుల వివాదంలో కీల‌కంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ష‌ర్మిల‌కు ఆస్తులు పంచ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్‌.. ఆమెకు అప్పులు ఇవ్వ‌డం ఏంట‌నేది చ‌ర్చ‌. మ‌రి దీనివెనుక ఏమ‌త‌ల‌బు ఉందో.. అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.