Begin typing your search above and press return to search.

కొత్త సంవత్సరం వేళ.. వైఎస్‌ షర్మిల సంచలన ప్రకటన!

కొత్త సంవత్సరం వేళ.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల సంచలన విషయాన్ని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 8:15 AM GMT
కొత్త సంవత్సరం వేళ.. వైఎస్‌ షర్మిల సంచలన ప్రకటన!
X

కొత్త సంవత్సరం వేళ.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల సంచలన విషయాన్ని వెల్లడించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, ఇడ్లీస్‌ అధినేత మనుమరాలు అట్లూరి ప్రియ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ అమెరికాలో బిజినెస్‌ మేనేజ్మెంట్‌ కోర్సు చదువుతూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమకు ఇరు వైపులా పెద్దలు అంగీకారం తెలపడంతో ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.


ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల కొత్త సంవత్సరం వేళ.. ఆమె పార్టీ శ్రేణులకు, అభిమానులకు శుభవార్త వినిపించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. తన కుమారుడు వివాహం ఫిబ్రవరి 17న జరుగుతుందని ప్రకటించారు. ఇందులో భాగంగా జనవరి 18న నిశ్చితార్థ వేడుక జరుగుతుందని తెలిపారు.


ఇందులో భాగంగా కాబోయే వధూవరులతో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ ను సందర్శించి అక్కడ తొలి శుభలేఖను ఉంచుతామని షర్మిల తెలిపారు. తద్వారా నాన్న వైఎస్సార్‌ ఆశీస్సులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా కొడుకు రాజారెడ్డి, కోడలు అట్లూరి ప్రియ కలిసిఉన్న ఫొటోలను షర్మిల షేర్‌ చేశారు.

షర్మిల్‌ ఎక్స్‌ పోస్టు ప్రకారం.. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్‌ రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనుంది. ఈ సంగతిని మీతో పంచుకోవడం పట్ల ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయలోని ౖవైఎస్సార్‌ ఘాట్‌ని సందర్శిస్తాం. తొలి ఆహ్వాన పత్రిక ఘాట్‌ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకుంటాం. ఇది చెప్పడానికి సంతోషంగా ఉంది’ అని షర్మిల తెలిపారు.

వధూవరులు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో ముందు ఈ పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారా అనే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల షర్మిల తల్లి వైఎస్‌ విజయమ్మ... ప్రియకు చీర పెట్టిన ఫొటో వైరల్‌ అయ్యింది. దీంతో పెళ్లి ఖాయమని తేలిపోయింది. ఇప్పుడు తాజాగా షర్మిల వీరి వివాహ తేదీని ప్రకటించారు. రాజస్థాన్‌ లోని జో«ద్‌ పూర్‌ ప్యాలెస్‌ లో రాజారెడ్డి, ప్రియ వివాహం జరుగుతుందని అంటున్నారు.