జగన్ మీద షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల!
అయితే ఆయన తన ప్రత్యర్థులను ఇంకా పెంచుకునిపోతున్నారా లేక వాటంతట అవే జరుగుతున్నాయో తెలియదు కానీ జగన్ ని మాత్రం చాలా మంది గురి పెడుతూనే ఉన్నారు.
By: Tupaki Desk | 10 Jun 2025 10:35 PM ISTవైసీపీ అధినేత జగన్ కి ఇంటా బయటా ప్రత్యర్థులే. అయితే ఆయన తన ప్రత్యర్థులను ఇంకా పెంచుకునిపోతున్నారా లేక వాటంతట అవే జరుగుతున్నాయో తెలియదు కానీ జగన్ ని మాత్రం చాలా మంది గురి పెడుతూనే ఉన్నారు.
ఇక ఆయన సోదరి ఒకనాడు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన షర్మిల ఇపుడు కాంగ్రెస్ లో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా ఆమె ఉంటూ జగన్ మీద విమర్శలు చేయడంలో ఎపుడూ ముందుంటారని చెబుతారు. ఇక వైసీపీ చూస్తే పూటకో వివాదంలో ఇరుక్కుని కూటమికి చిక్కుతోంది.
లేటెస్ట్ గా అమరావతి రాజధాని మీద సాక్షి మీడియా చానల్ లో ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏకంగా వైసీపీ అధినాయకత్వానికి చుట్టుకున్నాయి. అంతే కాదు పార్టీ మొత్తానికి ఇవి ఆపాదించి ప్రత్యర్ధులు టార్గెట్ చేస్తున్నారు.
దాంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏ విధంగా జవాబు చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. మొత్తానికి డిఫెన్స్ లో పార్టీ పడిన వేళ కూటమికి తోడు అన్నట్లుగా కాంగ్రెస్ సైతం జగన్ మీదనే వేలెత్తి చూపిస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల జగన్ మీద తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కి సొంత చెల్లెలు అంటే విలువ గౌరవం లేదని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. బయట బహిరంగ సభలలో నా అక్కచెల్లెళ్ళు అని జగన్ అంటారు కానీ ఆయనకు సొంత చెల్లెలుకు మర్యాద ఇవ్వడమే తెలియదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తనపైన కూడా తప్పుదు ప్రచారం చేయించింది అని ఆమె గతాన్ని గుర్తు చేశారు.
అలా జగన్ కి సొంత చెల్లెలుకే మర్యాద ఇవ్వడం తెలియదు కానీ బయట అక్క చెల్లెళ్ళకు విలువ ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఇక వైసీపీలో కో ఆర్డినేటర్ గా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డిని మూర్ఖుడుగా ఆమె అభివర్ణించారు. ఆయన మహిళలను పిశాచులతో రాక్షసులతో పోల్చడమేంటి అని మండిపడ్డారు. అలాగే సంకర జాతి వారు అంటారా అని ఆమె నిలదీశారు.
వైసీపీ చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తోందని షర్మిల నిందించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం షర్మిల సాక్షి టీవీలో జరిగిన డిబేట్ లో అమరావతి రాజధాని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఇపుడు మరోసారి ఆమె జగన్ మీద నేరుగా ద్వజమెత్తారు.
ఇప్పటిదాకా ప్రతిపక్షాలే జగన్ కి తల్లి చెల్లెలుకు విలువ ఇవ్వరు, వారిని ఇంటి నుంచి గెంటేశారు అని విమర్శలు చేస్తూ వచ్చారు. ఇపుడు వాటికి మరింత బలాన్ని చేకూర్చేలా షర్మిల జగన్ సొంత చెల్లెలు అని కూడా చూడరని ఏ మర్యాద ఇవ్వరని విమర్శించడం ద్వారా ఆయన్ని మరింత ఇరుకున పెట్టారని అంటున్నారు.
మొత్తానికి మహిళా లోకమంతా సాక్షిలో అమరావతి రాజధాని మీద జరిగిన డిబేట్ మీద మండిపోతూంటే షర్మిల కూడా ఆజ్యం పోసేలా మహిళల మద్దతుని వైసీపీకి మరింత దూరం చేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. దీనిని వైసీపీ నుంచి కౌంటర్ ఏమైనా ఉంటుందా లేక గతంలో మాదిరిగా షర్మిల వ్యాఖ్యలను లైట్ తీసుకుంటారా అన్నదే చూడాలని అంటున్నారు.