Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో స్టైల్ మార్చిన షర్మిల

ఎంపీలు అంతా ఏపీ గురించి మాట్లాడక్పోతే పదవులు ఎందుకు అన్నారు. చంద్రబాబు బీజేపీతో ఓపెన్ గా పొత్తు పెట్టుకుంటే జగన్ ఇండైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంటున్నారు అని నిందించారు.

By:  Tupaki Desk   |   25 July 2025 10:08 PM IST
జగన్ విషయంలో స్టైల్ మార్చిన షర్మిల
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ని తీవ్రంగా టార్గెట్ చేసేది ఎవరు అంటే కూటమి అని అనుకుంటారు. కానీ అంతకంటే ఒక అడుగు ఎక్కువగా కాంగ్రెస్ ఏపీ విభాగం ప్రెసిడెంట్ షర్మిల అని చెబుతారు. ఆమె జగన్ ని ఎక్కడా స్పేర్ చేయరు. నిన్నటికి నిన్న లిక్కర్ స్కాం లో కూటమి ప్రభుత్వానికే కొత్త విషయాలను చెప్పి జగన్ ని పూర్తిగా కార్నర్ చేశారు

జగన్ విషయంలో ఏమైనా మొహమాటలు ఉంటే కూటమికే ఉండొచ్చేమో కానీ తనకు లేవని చాటి చెప్పేశారు. లిక్కర్ స్కాం లో జగన్ కే నేరుగా 50 నుంచి అరవై కోట్లు ముడుపులు ప్రతీ నెలా అందేవని ఆమె సంచలన విషయాలే బయటపెట్టారు. అంతే కాదు కట్టని పన్నులు చీప్ లిక్కర్ వల్ల పోయిన ప్రాణాలు సైతం ఏకరువు పెట్టి మొత్తం అయిదేళ్ళలో జరిగిన ఆర్థిక ప్రాణ నష్టంతో పాటు ఖజానాకు చేసిన పన్నులు నష్టం అంతా జగన్ దే అని తేల్చేశారు. అందువల్ల సమగ్రమైన దర్యాప్తు చేయాలి తప్పించి ఇలా జైలులో వేయడం కానే కాదని ఆమె అంటున్నారు.

షర్మిల చెప్పిన ఈ విషయాలు ఏవీ కూటమి పెద్దలు ఎప్పుడూ అనలేదు. వారు ఇంకా వేల కోట్ల లిక్కర్ స్కాం అన్న దగ్గరే ఆగారు. ఇపుడు షర్మిల అందించిన కొత్త సమాచారంతో ఏమేమి చేస్తారో చూడాల్సి ఉంది. అయితే షర్మిల ఆ మరుసటి రోజే మొత్తం ఏపీలో ఉన్న అన్ని పార్టీల ఎంపీల మీద వురుచుకుపడ్డారు. విభజన హామీలు గుర్తున్నాయా ఎంపీలు అని ఆమె ప్రశ్నించారు.

లోక్ సభలో పాతిక మంది రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారని వీరంతా పార్లమెంట్ కి వెళ్ళి ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమి చేసారు అని నిలదీశారు. రాజధాని నిర్మాణానికి అయ్యే డెబ్బాఇ వేల కోట్ల రూపాయలు కేంద్రం భరించాల్సి ఉండగా అప్పు ఎందుకు తెస్తున్నారు అని నిగ్గదీశారు. పోలవరం ఎత్తుని 41 మీటర్లకే కుదిస్తున్నా ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుగ్గరాజపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రా రాయలసీమ ప్రత్యేక ప్యాకేజి ఏమయ్యాయని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తూంటే ఎంపీలు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని ఆమె ఫైర్ అయ్యారు. ఏపీలో ఉన్న పార్టీలన్నీ బీజేపీకి దాసులే అని షర్మిల తేల్చేశారు. పేరుకే టీడీపీ జనసేన వైసీపీ అని ఉన్నారని కానీ వీరంతా బీజేపీకి రబ్బర్ స్టాంప్ ఎంపీలు అని ఆమె అన్నారు.

ఎంపీలు అంతా ఏపీ గురించి మాట్లాడక్పోతే పదవులు ఎందుకు అన్నారు. చంద్రబాబు బీజేపీతో ఓపెన్ గా పొత్తు పెట్టుకుంటే జగన్ ఇండైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంటున్నారు అని నిందించారు. ఈ విధంగా ఆమె వైసీపీని బీజేపీని కలిపేసారు. జగన్ ని ప్రతీ రోజూ విమర్శించే షర్మిల ఇపుడు రూట్ ఇలా మార్చారు అని అంటున్నారు. ఒక రోజు ఆమె జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ మరుసటి రోజు కూటమితో కలిపి విమర్శిస్తున్నారు.

ఆ విధంగా తాను వ్యక్తిగత అజెండాను తీసుకోవడం లేదని చెప్పనున్నారు. ఇంతకు ముందు అయితే జగన్ మీద ఆమె విమర్శలు ఉండేవి. ఇపుడు మాత్రం ఒక రోజు జగన్ మీద మరో రోజు కూటమి మీద అన్న్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆమె రాజకీయ వ్యూహంలో వచ్చిన మార్పు అంటున్నారు. ఆమె ఏ విధంగా విమర్శించినా జగన్ ని మాత్రం బీజేపీతో కలిపి కట్టేస్తున్నారు. మొత్తానికి జగన్ ఒకనాడు వదిలిన బాణం ఈ రోజు ఆయనకే గట్టిగా గుచ్చుకుంటోంది అనే చెప్పాలి అంటున్నరు.