షర్మిలకు ఇప్పుడు అస్సలు బాధ లేదా ..!
తమను `వేరే` మహిళలతో పోల్చి మాట్లాడడంపై ఇక్కడి మహిళలు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
By: Tupaki Desk | 9 Jun 2025 9:00 AM ISTమహిళలను ఎవరు కించ పరిచినా ఊరుకునేది లేదంటూ..కొన్నాళ్ల కిందట శపథం చేసి.. కన్నీరు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల ఎక్కడ ఉన్నారు? అంటే.. సమాధానం లభించడం లేదు . ఒకవైపు రాజధాని అమరావతి మహిళలపై జగన్ మీడియాలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లు నిప్పులు కురిపిస్తున్నాయి. మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదేం పద్ధతి అంటూ.. నిలదీస్తున్నా రు. అంతేకాదు.. జగన్ కుటుంబం కూడా.. అమరావతి పరిధిలోనే ఉందని వ్యాఖ్యానించారు.
తమను `వేరే` మహిళలతో పోల్చి మాట్లాడడంపై ఇక్కడి మహిళలు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మరి ఇలాంటి సమయంలో ఒక పార్టీకి మహిళా నాయకురాలిగా ఉన్న షర్మిల కనీసం ఇప్పటి వర కు స్పందించకపోవడంపై అందరూ నివ్వెర పోతున్నారు. తరచుగా తన సోదరుడు జగన్‌ను టార్గెట్ చేసే షర్మిల... కేవలం తన సొంత లాభమే చూసుకుంటారా? అనే విమర్శలు వస్తున్నాయి. అంటే.. తనకు నొప్పి కలిగితే ఒకరకంగా.. వేరేవారికి నొప్పి కలిగితే పట్టించుకోరా? అనే చర్చ కూడా జరుగుతోంది.
``ఇదేం పద్దతి. మహిళగా ఆమె మాకు మద్దతు తెలపకపోయినా ఫర్లేదు. కనీసం.. జరిగిన దానిని ఖండించా లి కదా!`` అని రాజధాని ప్రాంత మహిళా రైతులు వ్యాఖ్యానించడం గమనార్హం. మరికొందరు.. ఇప్పుడు కష్టంలో ఉన్నవారిని కనీసం పరామర్శించేందుకు కూడా షర్మిల రాలేదని.. రేపు ఏ మొహం పెట్టుకుని వస్తారని .. ప్రశ్నించారు. ఇది వాస్తవం. మహిళగా.. మహిళా నాయకురాలిగా.. షర్మిల పుంజుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో తడబడుతూనే ఉన్నారు.
గతంలోనూ ఇలానే వ్యవహరించారు. విజయవాడ వదరల సమయంలో ఆమె కన్నెత్తి కూడా అటు చూడలేదు. కానీ.. ఏలూరులో ఎర్రకాలు పొంగి.. పొలాలు కొంత వరకు మునిగితే అక్కడకు వెళ్లారు. దీనికి కారణం.. అదేసమయంలో జగన్ ఢిల్లీలో ధర్నా పెట్టారు. దీనిని టార్గెట్ చేయడం కోసం.. ఆమె ఏలూరు వెళ్లారన్న చర్చ కూడా జరిగింది. ఇప్పుడు కూడా.. మహిళలకు కనీసం మద్దతు ప్రకటించి ఉంటే బాగుండేదన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహిళా రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
