షర్మిల అప్సెట్ అయ్యారా ?
కాంగ్రెస్ కి ఏపీలో పెద్దగా ఉనికి లేదు అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల ఉండడం వల్లనే ఎంతో కొంత మాట్లాడుకోవాల్సి వస్తోంది అని అంటారు. ఇక షర్మిల పీసీసీ చీఫ్ అయి రెండున్నరేళ్ళ కాలం గడచింది.
By: Satya P | 20 Jun 2026 6:00 AM ISTకాంగ్రెస్ కి ఏపీలో పెద్దగా ఉనికి లేదు అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల ఉండడం వల్లనే ఎంతో కొంత మాట్లాడుకోవాల్సి వస్తోంది అని అంటారు. ఇక షర్మిల పీసీసీ చీఫ్ అయి రెండున్నరేళ్ళ కాలం గడచింది. ఈ కాలంలో ఆమె కాంగ్రెస్ తరఫున పదవిలో ఉండి ఏమి సాధించింది అంటే తన అన్న వైఎస్ జగన్ ని మాజీగా చేయడమే. అది సగం సంతోషమా లేక పూర్తి ఆనందమా తెలియదు కానీ కాంగ్రెస్ మాత్రం ఏ కోశానా ఎత్తిగిల్లలేదు. మరో వైపు చూస్తే షర్మిల ఎంతసేపూ వైసీపీ మీదనే విరుచుకుపడతారు అన్న విమర్శలు కూడా కాంగ్రెస్ గ్రాఫ్ ని ఏ మాత్రం పెంచలేకపోయాయి. బీజేపీ మీద కూడా ఆమె విమర్శలు చేసినా ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల మాత్రం అంతగా రియాక్ట్ అవరు అన్న విమర్శలు ఉన్నాయి.
ఎందుకీ మౌనం :
ఇదిలా ఉంటే షర్మిల ఇటీవల కాలంలో ఫుల్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఆమె ఎక్కువగా పర్యటనలు చేయకపోయినా తన ఎక్స్ ఖాతా ద్వారా మాత్రం రియాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని సమస్యల మీద ఆమె ఎక్స్ వేదికగా చేసే ఆరోపణలు కానీ విమర్శలు కానీ కొంత హాట్ టాపిక్ గానే ఉంటూ వచ్చాయి. అలాంటి షర్మిల అయితే ఇపుడు పెద్దగా స్పందించడం లేదు అని అంటున్నారు. అంతే కాదు ఆమె మౌన ముద్రలో ఉన్నారు అని కూడా అంటున్నారు. ఇంతకీ షర్మిల మౌనం దేనికి సంకేతం, ఎందుకు ఇలా అన్న చర్చ వస్తోంది.
అనుకున్నది జరగలేదనా :
షర్మిల రాజ్యసభ సీటుని ఆశించారు అని చెబుతారు. ఆమెకి సీటు ఖరారు అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. కర్ణాటక కాంగ్రెస్ కోటాలో ఆమెకి ఈ సీటు ఇస్తారని కూడా అనుకున్నారు. ఇక ఆమె పేరు ప్రకటన తరువాయి అనుకున్న నేపధ్యంలో సడెన్ గా మాయమైది. దాంతోనే ఆమె అప్సెట్ అయ్యారా అన్న చర్చ వస్తోంది. లేకపోతే ఆమె సైలెంట్ గా ఇంతలా ఉన్న దాఖలాలు లేవని అంటున్నారు. క్రిష్ణలంక యువకుడు గాదె సాయి క్రిష్ణ మే 9 నుంచి కనిపించడం లేదని అంటున్నారు. ఇక ఆయనది లాకప్ డెత్ అని కూడా చెబుతున్నారు. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతున్నాయి. ఇక రాజకీయంగా కూడా ఇది అతి పెద్ద రచ్చగా మారింది. కానీ షర్మిల మాత్రం స్పందించకపోవడం మీదనే చర్చ సాగుతోంది.
జగన్ సైతం వెళ్ళారు :
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా సాయి క్రిష్ణ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. చంద్రబాబు అయితే తన వద్దకు సాయి క్రిష్ణ తల్లిని పిలిపించుకుని న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ విధంగా రాజకీయం అంతా సీరియస్ గా మారిన వేళ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా షర్మిల రియాక్ట్ కాకపోవడం మీదనే చర్చ సాగుతోంది. ఆమె ఈ ఇష్యూని ఒక రాజకీయ పార్టీ నేతగా కాకపోయినా ఒక పౌర సమాజంలోని పౌరురాలిగా అయినా రియక్ట్ కావాలి కదా అన్న వారూ ఉన్నారు. మరి ఆమె ఎందుకు సైలెంట్ అయింది అన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదనే అంటున్నారు.
