Begin typing your search above and press return to search.

మ‌హిళ‌ల క‌న్నీరు తుడుస్తాన‌న్న ష‌ర్మిల అడ్ర‌స్ ఎక్క‌డ‌...!

క‌నీసం ముర‌ళి కుటుంబాన్ని ఓదార్చేందుకు ఒక్క ఓదార్పు మాట చెప్పేందుకు కూడా ఆమె ఎందుకు ముందుకు రాలేక పోయారు?

By:  Tupaki Desk   |   13 May 2025 6:00 AM IST
మ‌హిళ‌ల క‌న్నీరు తుడుస్తాన‌న్న ష‌ర్మిల అడ్ర‌స్ ఎక్క‌డ‌...!
X

మ‌హిళ‌ల క‌న్నీరు తుడుస్తానంటూ.. ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఏమ‌య్యా రు? ఎక్క‌డున్నారు? ఇదీ.. ఇప్పుడు నెటిజ‌న్లు సంధిస్త‌న్న ప్ర‌శ్న‌. గ‌త నాలుగు రోజులుగా రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం.. అంద‌రినీ గుండెలు పిండేసిన విష‌యం.. అగ్నివీర్ ముర‌ళీ నాయ‌క్‌.. వీరోచిత మ‌ర‌ణం. జ‌మ్ము క‌శ్మీర్‌లోని రాజౌరీలో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో పాక్ తూటాల‌కు బ‌ల‌మై న నూనూగు మీసాల వీర జవాన్ మ‌ర‌ణం అంద‌రినీ క‌లిచి వేసింది.

పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ముర‌ళీ కుటుంబాన్ని ఓదార్చారు. వాస్త‌వానికి ముర‌ళీ త‌ల్లి జ్యోతి బాయిని ఓదార్చ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాలేదు. వైసీపీ, టీడీపీలు రాజ‌కీయాల‌కు అతీతంగా.. కుటుంబాన్ని ఓదార్చా యి. వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఉష‌శ్రీచ‌ర‌ణ్‌, మంత్రి స‌విత‌లు.. క‌లిసి వెళ్లి మ‌రీ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. ఎక్క‌డా రాజ‌కీయాలు చేయ‌కుండా.. కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని ఇరువురూ ప్ర‌క‌టించారు.

మ‌రి ఒక మ‌హిళా నాయ‌కురాలిగా.. అతి పెద్ద పార్టీకి అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల‌.. ఏమ‌య్యారు. క‌నీసం ముర‌ళి కుటుంబాన్ని ఓదార్చేందుకు ఒక్క ఓదార్పు మాట చెప్పేందుకు కూడా ఆమె ఎందుకు ముందుకు రాలేక పోయారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌హిళ‌ల క‌న్నీరు తుడుస్తాన‌ని .. వారి క‌ష్టాల‌ను త‌న క‌ష్టాలుగా భావిస్తాన‌ని గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వీధి వీధిలో ప్ర‌చారం చేసిన ష‌ర్మిల‌.. ముర‌ళీ మాతృమూర్తి క‌న్నీటి వ‌ర‌దో పొర్లుతుంటే.. ఎందుకు ఓదార్చ‌లేక‌పోయార‌న్న‌ది ప్ర‌శ్న‌.

అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఒక్క‌రు కూడా ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించింది లేదు. ఓదార్పు వా క్యాలు చెప్పింది లేదు. చివ‌ర‌కు మంత్రి స‌విత ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఆఖ‌రుకు ముర‌ళీ త‌ల్లిదండ్రు ల‌కు ముద్ద‌లు క‌లిపి నోటికి అందించి.. వారిని ఉప‌శ‌మించేలా చేశారు. నేనున్నానంటూ.. ముర‌ళీ వార్త తెలిసిన ద‌గ్గ‌ర నుంచి అంత్య‌క్రియ‌ల వ‌ర‌కు వారి కుటుంబంతోనే న‌డిచారు. మ‌రి ష‌ర్మిల ఏమైనట్టు? క‌నీసం ముర‌ళీ కుటుంబాన్నిఓదార్చే స‌మ‌యం కూడా చిక్క‌లేదా? అనేది నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి ఆమె ఏం జ‌వాబు చెబుతారో చూడాలి.