Begin typing your search above and press return to search.

షర్మిల గురించి...తెలంగాణా నాయకుల దగ్గర రాహుల్?

ఏపీలో కాంగ్రెస్ కి షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. అది అనూహ్యంగా జరిగింది. ఆమెలో రాజకీయ ఆకాంక్ష 2021లో బయటపడింది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 5:00 PM IST
షర్మిల గురించి...తెలంగాణా నాయకుల దగ్గర రాహుల్?
X

ఏపీలో కాంగ్రెస్ కి షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. అది అనూహ్యంగా జరిగింది. ఆమెలో రాజకీయ ఆకాంక్ష 2021లో బయటపడింది. ఆమె సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని మూడేళ్ళ పాటు నడిపింది. అయితే దానిని కొనసాగించలేకపోయింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఆమెకు ఇచ్చిన ఒక బిగ్ ఆఫర్ గా ఏపీసీసీ చీఫ్ పదవిని చెప్పుకున్నారు.

ఆనాటి ఏపీ రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ ఆలోచనలు షర్మిలకు నేరుగా నాటి సీఎం తన అన్న అయిన జగన్ తో వచ్చిన విభేదాలు, వైఎస్సార్ కుమార్తె కావడం ఇవన్నీ ఆమెకు కలసి వచ్చిన అంశాలు. ఏ వైఎస్సార్ బిడ్డ జగన్ వల్ల అయితే కాంగ్రెస్ ఏపీలో తన ఓటు బ్యాంక్ ని పూర్తిగా కోల్పోయిందో అదే వైఎస్సార్ ఆడబిడ్డ షర్మిల ద్వారా ఎంతో కొంత తిరిగి వెనక్కి తీసుకుని రావచ్చు అన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన.

అయితే గత ఏడాదిన్నరగా కాంగ్రెస్ కి షర్మిల సారధ్యం వహిస్తున్నా ఆ పార్టీ ఏ మాత్రం ఎత్తి గిల్లడం లేదు పైగా కాంగ్రెస్ కోసం షర్మిల ప్రత్యేకంగా చేసిన పోరాటాలు ఏవీ లేవని సొంత పార్టీ వారే అంటున్నారు. ఆమె తనకు దక్కిన పీసీసీ చీఫ్ పదవి ఆసరాతో అన్న మీద రాజకీయ విమర్శలు చేస్తూ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ వంటి వారు బాహాటంగానే ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది.

ఈ క్రమంలో షర్మిల వల్ల కాంగ్రెస్ కి ఎంత మేలు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అన్నదాని మీద ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇపుడు ఆలోచించే పనిలో పడింది అని అంటున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయిన తెలంగాణా కాంగ్రెస్ నేతల వద్ద ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి గురించి రాహుల్ స్వయంగా ప్రస్తావించారు అని అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ పార్టీ పుంజుకోవాలంటే ఏమి చేయాలి, షర్మిల నాయకత్వాన్ని నమ్మ వచ్చా అన్న ప్రశ్నలు హై కమాండ్ తెలంగాణా నాయకుల వద్ద సంధించింది అని అంటున్నారు. అంతే కాదు, షర్మిల ఏమైనా తెలుగుదేశం పార్టీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారా అన్న డౌట్ కూడా వ్యక్తం చేశారు అని గాసిప్స్ లాంటి ప్రచారం సాగుతోంది.

ఇక ఏపీలో కాంగ్రెస్ ని అభివృద్ధి చేయాలీ అంటే షర్మిలను మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా సాగిందని అంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏమిటి అని కూడా ఆరా తీశారని చెబుతున్నారు.

ఏపీలో కూటమి పాలన ఫెయిల్ అయిందని నివేదికలు ఏమైనా ఉన్నాయా అని కూడా కాంగ్రెస్ హైకమాండ్ వాకబు చేసింది అని అంటున్నారు. ఇక ఏపీలో పీసీసీ చీఫ్ పదవిని కాపులకు ఇస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగిందని చెబుతున్నారు.

బీజేపీ కూడా కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కాపులను చేరదీస్తే ఏలా ఉంటుంది అన్న డిస్కషన్ వచ్చిందని అంటున్నారు. ఇక ఏపీలో రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ కాంగ్రెస్ లో ఎవరైనా ఉన్నారా అన్న చర్చ కూడా జరిగిందని చెబుతున్నారు.

ఇల ఢిల్లీ వెళ్ళిన తెలంగాణా కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ హైకమాండ్ చాలా ప్రశ్నలనే వేసింది అని అంటున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో సైతం చర్చగా సాగుతోంది. దీనిని బట్టి చూస్తే కనుక ఏపీలో కాంగ్రెస్ తిరిగి లేవాలంటే షర్మిల నాయకత్వం సరిపోదు అన్నది కాంగ్రెస్ పెద్దల భావనగా ఉందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

అదే కాదు ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవాలంటే సామాజిక పరిస్థితులను సమీకరణలను బేరీజు వేసుకుని బలమైన సామాజిక వర్గానికి చెందిన ఫరి బ్రాండ్ లాంటి లీడర్ చేతికి పగ్గాలు అప్పగించాలని కూడా కాంగ్రెస్ పెద్దలు సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఏపీలో షర్మిలకి పదవీ గండం ఉందని సోషల్ మీడియాలో అయితే చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.