షర్మిల పొలిటికల్ భ్రమల్లో బతికేస్తోన్నట్టేనా.. ?
ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. సొంత పార్టీ నాయకులు. ఎందుకంటే ఆశ ఉండొచ్చు. కానీ వాటికి కూడా ఒక హద్దు ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాను.
By: Tupaki Desk | 26 Jun 2025 11:00 PM ISTఈ మాట అంటున్నది ఎవరో కాదు.. సొంత పార్టీ నాయకులు. ఎందుకంటే ఆశ ఉండొచ్చు. కానీ వాటికి కూడా ఒక హద్దు ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాను. ఇది చేస్తాను.. అని చెప్పడం తప్పు కాదు. కానీ, అధికారంలోకి వచ్చే ప్రాతిపదిగా అధికారంలోకి వచ్చే విధంగా జనాల్ని తమ వైపు తిప్పుకునే ప్రక్రియ రాజకీయ నాయకులకు పార్టీలకు అత్యవసరం. కానీ ఆ దిశగా అడుగులు వేయకుండా సొంత అజెండాను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న షర్మిల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంటూ వ్యాఖ్యానించడంపై సొంత నేతలే నవ్వుతున్నారు.
అధికారంలోకి వస్తే.. ఏదో చేసేస్తామని, ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆపేస్తాం.. ఇలా ఆమె చెప్పడం రాజకీయంగా ఆమెకు బాగుందేమో కానీ రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నప్పుడు షర్మిల రాజకీయాలు మైనస్ మార్కులు పడుతున్నాయి. ఈ విధానంపై ఆమె ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందిజ వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ గ్రాఫ్ ను పెంచాలి. ఓటు బ్యాంకు ను పెంచుకోవాలి. క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాటం చేయాలి. కానీ షర్మిల చేస్తున్న పోరాటం గమనిస్తే సొంత అన్నపై పోరాటం చేయడం.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్టు కనిపించడం మాత్రమే తెలుస్తుందిఅనేది విశ్లేషకులు చెబుతున్న మాట.
కుటుంబ కలహాలను రాజకీయానికి వాడుకుంటున్నారనే వాదన షర్మిలకు మాయని మచ్చలా మారుతుంది. దీని నుంచి ఆమె బయట పడకపోతే వ్యక్తిగతంగా రాజకీయాలను శాసించే పరిస్థితి కానీ ప్రజలను తనకు అనుకూలంగా మలచుకుని ఓట్లను దూసుకునే విషయంలో కానీ షర్మిల సక్సెస్ కావడం అనేది చాలా కష్టం. ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులను గమనిస్తే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గత ఏడాది ఎన్నికల కంటే కూడా ఇప్పుడు ఘోరంగా పడిపోయింది. నాయకులు ఒక్కొక్కరుగా బయటికి రావడం ఉన్నవారు కూడా మౌనంగా ఉండడం వంటివి కనిపిస్తున్నాయి.
షర్మిల తనను తాను వెనక్కి తిరిగి చేసుకుంటే.. తాను పెడుతున్న ప్రెస్ మీట్లని. తాను పాల్గొంటున్న లేదా చేపడుతున్న.. నిరసనల్లో కానీ ఎంత మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొంటున్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర పార్టీకి ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాంటప్పుడు కీలక నాయకులు ముందుకు రావాలి. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ముందుకు వస్తే ఆవిడ వెనక అనేకమంది నాయకులు కలిసి రావాలి. వీరిలో కీలక నాయకులు ఉండాలి. కానీ షర్మిల వెనక ఉంటున్నది కనీసం వార్డు స్థాయి నాయకులు కూడా కాదనేది అందరికీ తెలిసిన నిజం.
దీనిని బట్టి ఆమె తన స్థాయిని అంచనా వేసుకుని.. ఎంత ఎత్తు ఎగరాలి.. మనం ఎంత ఎత్తు ఎగురుతున్నాం.. అనేదాన్ని చూసుకుంటే ఆ ఎత్తుకు సమాన స్థాయిలో ఆమె రాజకీయాలు చేయగలగాలి. అలా చేయనప్పుడు లేదా చేస్తున్నాననే భ్రహ్మ కల్పించినప్పుడు ఆ పార్టీ ఎదుగుదల అంతంత మాత్రమే ఉంటుంది. చాలా ఆశలతో షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని చర్చ జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ను చూసుకున్న ప్రజలు ఆ తర్వాత షర్మిలను నాయకురాలుగా ఓన్ చేసుకుంటారని చర్చ కూడా తెరమీదకు వచ్చింది.
