Begin typing your search above and press return to search.

శరద్ పవార్ గేమ్ స్టార్ట్...అటు ఎన్డీయేతో కూడా ?

ఈ ఎంపీలు ఎమ్మెలేలు తీరు చూస్తే గత మూడు ఎన్నికల్లో విపక్షం వైపునే శరద్ పవర్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. మధ్యలో ఉద్ధవ్ థాక్రే సీఎం గా ఉన్నపుడు ఎమ్మెల్యేలు అయితే కొంత కాలం అధికారం అనుభవించారు.

By:  Satya P   |   9 July 2026 4:00 AM IST
శరద్ పవార్ గేమ్ స్టార్ట్...అటు ఎన్డీయేతో కూడా ?
X

మరాఠా యోధుడు, జాతీయ రాజకీయాల్లో దిగ్గజ నేత శరాద్ పవార్ తన పొలిటికల్ గేమ్ ని స్టార్ట్ చేశారు అని అంటున్నారు. ఆయన తన పార్టీ శరద్ పవార్ ఎన్సీపీని ఏ వైపు తిప్పాలి అన్న దాని మీద మాస్టర్ స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. శరద్ పవార్ ఎన్సీపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. అలాగే 288 స్థానాలున్న మహారాష్ట్ర శాసనసభలో శరద్ పవార్ పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎంపీలు ఎమ్మెలేలు తీరు చూస్తే గత మూడు ఎన్నికల్లో విపక్షం వైపునే శరద్ పవర్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. మధ్యలో ఉద్ధవ్ థాక్రే సీఎం గా ఉన్నపుడు ఎమ్మెల్యేలు అయితే కొంత కాలం అధికారం అనుభవించారు. ఇక ఎంపీలు 15 ఏళ్ళుగా అపొజిషన్ తోనే ఇబ్బంది పడుతున్నారు.

ఇండియా కూటమి వైపు :

శరద్ పవర్ అయితే ఇండియా కూటమిలో తన ఎన్సీపీని విలీనం చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అదే జరిగితే సొంత అస్తిత్వం పోతుంది అన్నది కూడా పార్టీలో ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఇండియా కూటమిలో చేరితే గుంపులో గోవిందంగా మారుతాం అన్నది కూడా ఉంది. ఇక ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షంలో చేరేందుకు ఎందుకు ఈ కొత్త నిర్ణయాలు అన్నది కూడా ఉంది అని అంటున్నారు. దాంతో శరద్ పవార్ పార్టీ సరికొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు.

కీలక భేటీతో చర్చ :

ఇదిలా ఉంటే శరద్ పవార్ పార్టీకి చెందిన సీనియర్ నేత జయంత్ పాటిల్ అలాగే బీజేపీకి చెద్నిన జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే తాజాగా ముంబైలోకి ఒక స్టార్ హొటల్ లో భేటీ అయినట్లుగా వచ్చిన వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఇద్దరి భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని చెబుతున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతిలో చేరితే ఏ విధంగా ప్రాధాన్యత ఉంటుంది అన్నది చర్చించారు అంటున్నారు. లేక చేరకుండా విడిగా ఉంటూ మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చిందని చెబుతున్నారు.

ఎంపీలు ఎన్డీయేలోకి :

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు మహారాష్ట్రలోని శరద్ పవార్ కి చెందిన ఎంపీలు మద్దతు ఇస్తే కనుక జాతీయ రాజకీయాలలో వారికి ప్రాధాన్యత ఏ మేరకు ఇస్తారు కేంద్ర మంత్రి పదవుల విషయంలో కూడా ఏమైనా హామీ ఉంటుందా అన్న చర్చ సాగిందని అంటున్నారు. నిజానికి చూస్తే శరాద్ పవార్ కి చెందిన ఎనిమిది మంది ఎంపీలలో అయిదురుగు అయితే ఎన్డీయేలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇపుడు ఏకంగా పార్టీ మొత్తం ఎన్డీయేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడితే కేంద్ర మంత్రి పదవులు కీలక శాఖలు దక్కుతాయని అంచానా వేస్తున్నారు అని అంటున్నారు. ప్రధానంగా శరాద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు.

మహా పాలిటిక్స్ కోసం :

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాక్రేది చాలా తొందరగా దెబ్బ తింటోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాయుతిలో చేరి అధికార పదవులు పొంది శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీని దెబ్బ కొట్టాలన్నది కూడా శరద్ పవార్ వ్యూహంగా కనిపిస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రస్తుతం ఉన్న వాతావరణంతో రాజకీయ అవకాశాలను వాడుకోవాలని పవార్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో శరద్ పవార్ పార్టీ విలీనం అవుతుంది అని వార్తలు ఒక వైపు ప్రచారంలో ఉన్న వేళ మరాఠా యోధుడు కొత్త గేమ్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు.