Begin typing your search above and press return to search.

అంతర్జాతీయంగా ఆ అంశంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు 2 ప్లేస్

మన దేశానికి సంబంధించిన హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్ పోర్టుతో పాటు బెంగళూరు.. కోల్ కతా ఎయిర్ పోర్టులు మంచి పని తీరును ప్రదర్శించాయి.

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:37 AM GMT
అంతర్జాతీయంగా ఆ అంశంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు 2 ప్లేస్
X

వావ్ అనే అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. ఇటీవల కాలంలో పలు అవార్డులు.. రివార్డుల్ని సొంతం చేసుకుంటూ.. పలు అంశాల్లో రికార్డు స్థాయి పని తీరును ప్రదర్శిస్తున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా సమయపాలన విషయంలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు.. నిర్వాహణాపరమైన పనితీరుతోపాటు.. సమయపాలనలో దూసుకెళుతోంది.

మన దేశానికి సంబంధించిన హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్ పోర్టుతో పాటు బెంగళూరు.. కోల్ కతా ఎయిర్ పోర్టులు మంచి పని తీరును ప్రదర్శించాయి. అంతర్జాతీయంగా పెద్ద ఎయిర్ పోర్టుల విభాగంలో రెండో స్థానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు నిలిచింది. బెంగళూరు ఎయిర్ పోర్టు మూడో స్థానంలో.. కోలకతా విమానాశ్రయం తొమ్మిది స్థానంలో నిలిచింది. ఆన్ టైమ్ పెర్ ఫార్మెన్స్ రివ్యూ పేరుతో ‘సిరియం’ అనే ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది.

నిర్వహణ పరమైన పని తీరు.. సమయపాలన విషయంలో అమెరికాకు చెందిన మిన్నెపొలిస్ లోని సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు 84.44 శాతం ఓటీపీ (ఆన్ టైమ్ పెర్ ఫార్మెన్స్) తో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42 శాతం ఓటీపీతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండింటి మధ్య తేడా చూస్తే కేవలం 0.2 శాతం మాత్రమే కావటం గమనార్హం.

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. మీడియం ఎయిర్ప పోర్టుల విభాగంలో కోల్ కతాలోని నేతాజా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఎయిర్ పోర్టు విషయానికి వస్తే ఇలా ఉంటే.. విమానయాన సంస్థల విషయానికి వస్తే మన దేశానికి చెందిన ఇండిగో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

బడ్జెట్ ఎయిర్ లైన్స్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ ఎయిర్ లైన్స్ 92.36 శాతం ఓటీపీతో మొదటి స్థానంలో మొదటి స్థానంలో నిలిచింది. మన దేశానికి చెందిన ఇండిగో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అదేసమయంలో ఆసియా - పసిఫిక్ ప్రాంతాల పరంగా చూస్తే.. బడ్జెట్ ఎయిర్ లైన్స్ విభాగంలో జపాన్ కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్ వేస్ మొదటి స్థానంలో.. జపాన్ ఎయిర్ లైన్స్ రెండో స్థానంలో.. థాయ్ ఎయిర్ ఏషియా మూడోస్థానంలో నిలవగా.. మన దేశానికి చెందిన ఇండిగో నాలుగో స్థానంలో నిలవటం గమనార్హం.