Begin typing your search above and press return to search.

శృంగార తార షకీలపై దాడి... రంగంలోకి పోలీసులు!

శృంగార తారగా ఎన్నో సినిమాల్లో నటించిన షకీలా... తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించారు

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:18 AM GMT
శృంగార తార షకీలపై దాడి... రంగంలోకి పోలీసులు!
X

శృంగార తారగా ఎన్నో సినిమాల్లో నటించిన షకీలా... తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకానొక సమయంలో షకీల సినిమా విడుదలవుతుందంటే... మహళాయంలో స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారనే ఒక టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంటుంది. అయితే అలాంటి స్టార్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో ఇటీవలే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా నటి షకీలపై దాడి జరిగిందని తెలుస్తోంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అలా అని షకీలపై దాడిచేసింది బయటవారెవరో కాదు... స్వయంగా ఆమె పెంచుకుంటున్న కూతురు అని తెలుస్తుండటం గమనార్హం!

అవును... తనపై తాను పెంచుకుంటున్న కూతురు శీతల్ దాడిచేసిందంటూ షకీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై శీతల్ దాడి చేస్తున్న సమయంలో... అక్కడే ఉన్న లేడీ లాయర్ పై శీతల్, ఆమె తల్లి అసభ్యకరంగా మాట్లాడారని పోలీసులకు తెలిపారు. మరోపక్క అదే పోలీస్ స్టేషన్ లో శీతల్ కూడా షకీలా పై ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా... నటి షకీలా చాలా కాలంగా శీతల అనే ఆమెను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్థలు రావడంతో శీతల్ ఇంటినుంచి వెళ్లిపోయిందట. అయితే ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆమె తన కన్న తల్లితో తిరిగి వచ్చిందని.. తాను సర్దిచెప్పే ప్రయత్నం చేయగా తనపై.. ఆమె కన్న తల్లితో కలిసి దాడి చేసిందని షకీలా పోలీసులకు తెలిపారు.

దీంతో షమీల.. శీతల్ పైనా, ఆమె కన్నతల్లిపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో అదే పోలీస్ స్టేషన్ లో షకీలపై శీతల్ ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు ఫిర్యాదులనూ తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారందా దర్యప్తు మొదలుపెట్టారని తెలుస్తుంది.