Begin typing your search above and press return to search.

లుక్ అవుట్ నోటీసులు... షకీల్ కొడుకు దుబాయ్ వెళ్లిపోయాడా?

అవును... బోధన్ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు

By:  Tupaki Desk   |   27 Dec 2023 9:38 AM GMT
లుక్  అవుట్  నోటీసులు... షకీల్  కొడుకు దుబాయ్  వెళ్లిపోయాడా?
X

ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి 2:45 గంటల సమయంలో "ప్రజాభవన్" ముందున్న బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ కారు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో సాహిల్ పై లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు పంజాగుట్ట పోలీసులు. అయితే... సాహిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. ఇందులో భాగంగా దుబాయ్ కి చేరుకున్నాడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది!

అవును... బోధన్ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతను పరారీలో ఉన్నాడని.. ముంబయి నుంచి దుబాయికి వెళ్లిపోయాడని అంటున్నారు! దీంతో... నిందితుడిని నగరానికి రప్పించేందుకు పంజాగుట్ట పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ ను లొంగిపొమ్మని మాజీ ఎమ్మెల్యే షకీల్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ రాత్రి ఏమి జరిగింది?:

ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి 2:45 గంటల ప్రాంతంలో "ప్రజాభవన్" ముందున్న బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ కారు ఢీకొట్టింది. దీంతో... సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికిచేరుకున్నారు. అనంతరం ఆ కారు సాహిల్ దేనని, ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది కూడా అతనేనని పోలీసులు గుర్తించారని తెలుస్తుంది.

ఈ సమయంలో బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం అతనిని పంజాగుట్ట స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సమయంలో సాహిల్ తండ్రి బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అదే రోజు రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చి.. సాహిల్ స్థానంలో ఇంట్లో పని చేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది!

ఈ సమయంలో పోలీసులతో... బ్రీత్ అనలైజ్ టెస్ట్ కోసం తీసుకుని వెళ్తున్న సమయంలో సాహిల్ పారిపోయినట్లు ప్రచారం చేయించారని అంటున్నారు. అయితే ఈ కేసులో తెరవెనుక ఏదో జరుగుతుందనే విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లిన నేపథ్యంలో... ఈ వ్యవహారంపై ఇంటర్నల్ విచారణకు ఆదేశించారు.

ఈ సమయలో సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు మొదలుపెట్టారు! ఇందులో భాగంగా ఆ రాత్రి ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట స్టేషన్ వరకూ ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించడం తోపాటు.. స్టేషన్ లోని కెమెరాల్లో సాహిల్ ను స్టేషన్ కు తీసుకొచ్చినట్లు గుర్తించారని తెలుస్తుంది. దీంతో నైట్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేశారని అంటున్నారు!

ఈ నేపథ్యంలోనే వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడంతో బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైదరాబాద్ నుంచి ముంబైకి.. అటు నుంచి దుబాయ్ కీ వెళ్లాడని పోలీసులు గుర్తించారని సమాచారం!