టీడీపీ వర్సెస్ వైసీపీ : ...అక్కడ ముందే హీట్
ఇక శింగనమలలో పోటాపోటీగా రాజకీయం సాగుతోంది. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా దూకుడుగానే ఉంటారు.
By: Satya P | 7 Dec 2025 9:18 AM ISTఏపీ కాంగ్రెస్ నుంచి రెండు సార్లు గెలిచి ఒకసారి మంత్రి కూడా అయిన సాకే శైలజానాధ్ పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. ఆయన 2024 ఎన్నికల తరువాత వైసీపీలో చేరిపోయారు. దాంతో ఆయన సొంత సీటు శింగనమలను జగన్ ఇంచార్జిగా చేశారు. దాంతో అక్కడ రాజకీయ వేడిని ముందే పుట్టిస్తున్నారు ఈ సీనియర్ నేత. ఎన్నికలు చూస్తే ఇంకా మూడేళ్ళకు పై దాటి ఉన్నాయి. అయినా సరే తనదైన స్టైల్ లో పొలిటికల్ బ్యాటింగ్ ని స్టార్ట్ చేశారు. అక్కడ తొలిసారి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణితో ఢీ కొడుతూ పార్టీ పట్టుని పెంచే పనిలో పడ్డారు.
వైసీపీకి బలం :
రాయలసీమలో వైసీపీకి బలం ఉంది. అయితే అనంతపురం జిల్లాలో టీడీపీ చాలా సీట్లలో గట్టిగానే ఉంది. అందులో శింగనమలలో కూడా టీడీపీ జెండా బాగానే ఎగుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని ట్రక్ డ్రైవర్ గా ఉన్న వీరాంజనేయులుకి టికెట్ ఇచ్చింది. ఆయన మంచి అభ్యర్ధి అయినా అంగబలం అర్ధ బలం సరిపోలేదు. ఇక ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా ప్రతిపక్షంలో పార్టీని నడిపించలేకపోయారని చెప్పుకున్నారు. అదే సమయంలో శైలజానాథ్ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రావడంతో ఆయనకు ఈ సీటు ఇచ్చారు. ఇక ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నా ఈ సీనియర్ నాయకుడు జోరు పెంచుతున్నారు.
పోటా పోటీ గా :
ఇక శింగనమలలో పోటాపోటీగా రాజకీయం సాగుతోంది. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా దూకుడుగానే ఉంటారు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం యువ నాయకురాలు కావడంతో తన పాబల్యం పెంచుకునేందుకు చూస్తున్నారు. ఆమె ఒక వైపు ప్రభుత్వ కార్యక్రమాలను జనంలో ఉంచుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ అసలైన ప్రతిపక్ష పాత్రని శైలజానాధ్ పోషిస్తున్నారు. ఆయన తాజాగా అరటి గెలలను మెడలో వేసుకుని భారీ ర్యాలీని రైతులతో నిర్వహించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర లేదని చెబుతూ ఆయన కూటమి ప్రభుత్వం మీద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు
జనరల్ కేటగిరి లోకి :
అంతే కాదు ఏ ఇష్యూ అయినా జనంలో అంటున్నారు. దాంతో ఇక్కడ రాజకీయం చూస్తే హీటెక్కిపోతోంది. వచ్చే ఎన్నికల్లో శైలజానాధ్ కి టికెట్ వైసీపీ నుంచి ఖాయమని అంటున్నారు. మరి టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తారా లేదా అన్నది చూడాలి. అయితే ప్రస్తుతానికి శింగనమల రిజర్వుడు నియోజకవర్గం గా ఉంది. రేపటి రోజున పునర్ విభజన జరిగితే జనరల్ కేటగిరి లోకి వెళ్తుంది అని అంటున్నారు. దాంతో 2029 ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు. కానీ వైసీపీ టీడీపీల తీరు చూస్తే మాత్రం రేపో మాపో ఎన్నికలు అన్నట్లుగానే సీన్ ఉందని అంటున్నారు.
