Begin typing your search above and press return to search.

షోయ‌బ్ మాలిక్ మూడ‌వ పెళ్లి ఇదేం ట్విస్ట్!

దీంతో ఈ పెళ్లి సానియాకి తెలియ‌కుండా జ‌రిగిందా? ఏంటి? అంటూ ఓ ర‌క‌మైన క‌న్ ప్యూజ‌న్ అభిమానుల్లో క‌నిపిస్తుంది. షోయ‌బ్ మాలిక్ కి ఇది మూడ‌వ వివాహం కావ‌డం విశేషం.

By:  Tupaki Desk   |   20 Jan 2024 7:59 AM GMT
షోయ‌బ్ మాలిక్ మూడ‌వ పెళ్లి ఇదేం ట్విస్ట్!
X

షోయ‌బ్ మాలిక్-సానియా మిర్జా క‌లిసి ఉన్నారా? విడిపోయారా? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఇద్ద‌రు విడిపోయిన‌ట్లు..దూరంగా ఉన్న‌ట్లు..విడాకులు తీసుకున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం త‌ప్ప వాటిపై ఏనాడు ఇద్ద‌రు అధికారికంగా స్పందించింది లేదు. ఇంత‌లోనే షోయబ్ మాలిక్ ఇప్పుడు మూడ‌వ పెళ్లి చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. నేరుగా ఈవిష‌యాన్ని ఆయ‌నే సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించాడు.

పాకిస్తాన్ న‌టి స‌నా జావెద్ ని పెళ్లి చేసుకున్న‌ట్లు ..ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను షోయ‌బ్ మాలిక్ త‌న ఖాతాలో పోస్ట్ చేసాడు. దీంతో షోయ‌బ్ మూడ‌వ సారి పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి స‌రిగ్గా రెండు రోజుల క్రిత‌మే సానియాతో విడిపోతున్నారంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై సానిమా మీర్జా విడాకులు అనేది చాలా క‌ష్ట‌మంటూ ఓ పోస్ట్ పెట్టారు. అది నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇంత‌లోనే షోయ‌బ్ పాకిస్తాన్ న‌టిని పెళ్లి చేసుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

దీంతో ఈ పెళ్లి సానియాకి తెలియ‌కుండా జ‌రిగిందా? ఏంటి? అంటూ ఓ ర‌క‌మైన క‌న్ ప్యూజ‌న్ అభిమానుల్లో క‌నిపిస్తుంది. షోయ‌బ్ మాలిక్ కి ఇది మూడ‌వ వివాహం కావ‌డం విశేషం. 2010 లో ఆయేషాతో షోయ‌బ్ మాలిక్ విడాకులు తీసుకున్నాడు.అదే ఏడాది సానియా మిర్జాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఎంతో వైభ‌వంగా జ‌రిగింది. వివాహం అనంత‌రం కొత్త కాపురం దుబాయ్ లో ప్రారంభించారు.

ఆ దంప‌తుల‌కు 2018 లో ఓ కుమారుడు జ‌న్మించాడు. ఇక స‌నా జావెద్ కి ఇంత‌కు ముందు వివాహం జ‌రిగింది. 2020 లో ఆమె ఓ పాకిస్తాన్ సింగ‌ర్ ని పెళ్లి చేసుకుంది. అటుపై 2023 లో విడాకులతో వేర‌య్యారు. ఇప్పుడు షోయ‌బ్ మాలిక్ కి ద‌గ్గ‌రైంది. మ‌రి ఈ పెళ్లిపై సానియా మీర్జా ఎలా రియాక్ట్ అవుతుంది? అన్న‌ది చూడాలి. షోయ‌బ్ తో పెళ్లైన సంద‌ర్భంగా స‌నా జ‌వాద్ త‌న ఇన్ స్టా ఖాతా పేరును మార్చేసింది. షనా షోయ‌బ్ మాలిక్ గా మార్పు చేసింది. ఈ సంద‌ర్భంగా షోయ‌బ్ ని పెళ్లాడిన ఫోటోల్ని పోస్ట్ చేసింది.