Begin typing your search above and press return to search.

మథుర శ్రీ కృష్ణ జన్మభూమిపై అలహాబాద్ హైకోర్టు తాజా ఆదేశాలేంటి?

రాముడు అయోధ్యలో పుట్టాడు. శ్రీక్రిష్ణుడు మథురలో జన్మించాడు. పురాణాల్లో స్పష్టంగా చెబుతున్నా.. దానికి సంబంధించిన వివాదాలు విచిత్రంగా కనిపిస్తాయి

By:  Tupaki Desk   |   15 Dec 2023 4:36 AM GMT
మథుర శ్రీ కృష్ణ జన్మభూమిపై అలహాబాద్ హైకోర్టు తాజా ఆదేశాలేంటి?
X

రాముడు అయోధ్యలో పుట్టాడు. శ్రీక్రిష్ణుడు మథురలో జన్మించాడు. పురాణాల్లో స్పష్టంగా చెబుతున్నా.. దానికి సంబంధించిన వివాదాలు విచిత్రంగా కనిపిస్తాయి. అదే విధంగా రామసేతు విషయంలోనూ. తాజాగా మథురకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది. శ్రీక్రిష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి తాజాగా ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి. శ్రీక్రిష్ణ జన్మభూమి మందిరానికి సమీపంలోని షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

కోర్టు పర్యవేక్షణలో జరిగే ఈ సర్వేను ముగ్గురు న్యాయవాదులను అడ్వకేట్ కమిషనర్లుగా నియమించారు. దీనికి సంబంధించిన విధివిధానాల్ని ఈ నెల 18న (సోమవారం) హైకోర్టు వెల్లడించనుంది. వారణాసిలోని మసీదు ప్రాంగణలో జరిగిన శాస్త్రీయ సర్వే మాదిరే.. తాజా సర్వే కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ అసలీ వివాదం ఏమిటి? కోర్టు తాజా ఆదేశాల్ని ఎందుకు జారీ చేసిందన్న విషయంలోకి వెళితే..

మథురలోని కట్రా కేశవ్ దేవ్ మందిరం మూల మూర్తి అయిన శ్రీక్రిష్ణ విరాజమాన్ పేరుతో హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యింది. శ్రీక్రిష్ణుని మిత్రులమని పేర్కొంటూ ఏడుగురు వ్యక్తులుఈ కేసు వేశారు. వీరిలో ముగ్గురు లాయర్లు కావటం గమనార్హం. గతంలో మందిరాన్ని పడగొట్టి మసీదు నిర్మించారని.. అందుకు ఆధారాలు ఉన్నాయని పిటిషన్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పుడున్న ప్రార్థనాలయంలో విగ్రహాలను గుర్తించేందుకు నిర్ణీత వ్యవధిలో శాస్త్రీయ సర్వే జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

దీనికి స్పందనగా.. ముగ్గురు లాయర్లతో కూడిన కమిటీని అలహాబాద్ హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం ఇలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముస్లింల గౌరవాన్ని హరించటమే లక్ష్యంగా ఒకవర్గం పెట్టుకుందున్న ఆయన.. ఈ సమస్యపై గతంలోనే రాజీ కుదిరినా.. ప్రార్థనా స్థలాల చట్టం ఉన్నా పట్టించుకోకపోవం ఏమిటి? ప్రశ్నిస్తున్నారు.