వయసు దాచిన 'వాంఛ': సంచలన నివేదిక
దేశంలో పెరుగుతున్న అత్యా*చార ఘటనలు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి.
By: Tupaki Desk | 17 April 2025 3:10 PM ISTదేశంలో పెరుగుతున్న అత్యా*చార ఘటనలు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా.. చిన్నారులు, మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. ఇక. పురుషుల విషయానికి వస్తే.. 70-90 ఏళ్ల వాళ్లు కూడా.. ఈ ఘటనల్లో నిందితులుగా తేలుతున్నారు. జైళ్ల పాలవుతున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? కారణాలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
దీనిపై ఢిల్లీకి చెందిన ఓ సర్వే సంస్థ గత ఆరుమాసాలుగా దేశవ్యాప్తంగా సర్వే చేసింది. దీనిలో కొన్ని సంచ లన విషయాలు వెలుగు చూశాయి. తీసుకునే ఆహారంలో పెరుగుతున్న రసాయన పదార్థాలు వాంఛలను పేట్రేగేలా చేస్తున్నాయన్నది ప్రధాన అంశం. అయితే.. ఇది అందరిలోనూకనిపించాలి కదా? అనే ప్రశ్న వస్తుంది. కానీ, దాదాపు కొన్నాళ్లుగా కోరికలను అణిచిపెట్టుకున్న వారిలో ఈ రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటోందని తెలిపింది.
ముఖ్యంగా షుగర్ వ్యాధిలేని పురుషులు.. మహిళల్లోనూ రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటోందని తెలిపింది. ఢిల్లీలో కొన్నాళ్ల కిందట.. జరిగి ఓ ఘటనను ప్రస్తావిస్తూ.. దీనిలో బాధితులైన ఇద్దరు యువకుల వ్యవహారాన్ని ప్రస్తావించడం గమనార్హం. 50-60 ఏళ్ల మధ్య వయసున్న ఓ మహిళ.. ఇద్దరు యువకులను నిర్బంధించిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. దీని కి కారణం.. రసాయనాలేనన్నది సర్వే సారాంశం.
ఇక, చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోవడానికి.. వయసు ద్వారా వచ్చిన అసహజ లైంగిక కోరికలే నన్నది సర్వే చెబుతున్న మాట. అయితే.. దీనిని నిలువరించేందుకు రసాయనాలు తక్కువగా ఉండే.. సహజసిద్ధమైన పదార్ధాలను తీసుకోవాలని.. మసాలా దినుసుల వాడకాలను తగ్గించాలని.. పిజ్జాలు బర్గర్ల వినియోగాన్ని తగ్గించాలని సూచించింది. దీనిని త్వరలోనే విడుదల చేయనుంది.
