విడాకుల ప్రభావం: రన్నింగ్ ట్రైన్ లో నిప్పంటించాడు.. వీడియో వైరల్!
ఇటీవల కాలంలో కొంతమందికి విడాకులు అత్యంత సాధారణ విషయంగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 28 Jun 2025 12:00 AM ISTఇటీవల కాలంలో కొంతమందికి విడాకులు అత్యంత సాధారణ విషయంగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరికొంతమందికి మాత్రం దీన్ని జీవితంలోనే అతిపెద్ద విషాదంగా భావిస్తుంటారు. ఈ సమయంలో విడాకులతో కలత చెందిన సుమారు 67 ఏళ్లున్న వ్యక్తి.. రన్నింగ్ ట్రైన్ లో నిప్పు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అవును... సియోల్ లో కదులుతున్న సబ్ వే రైలు లోపల ఓ వ్యక్తి నిప్పటించారు. అతనిని ఇంటిపేరు వోన్ తో గుర్తించినట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ సంఘటన మే 31న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్ర ఆస్తినష్టంతో పాటు, ప్రయాణికులు పలువురు తీవ్ర గాయాలపాలైనట్లు నివేదించింది.
వివరాళ్లోకి వెళ్తే... సియోల్ సబ్ వే లైన్ 5లో, యౌయినారు - మాపో స్టేషన్స్ మధ్య ఉన్న సెక్షన్ లో ఉదయం 8:42 గంటల ప్రాంతంలో రైలు హాన్ నది కింద సముద్రగర్భ సొరంగం గుండా వెళుతుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి రైలులో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 22 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు.
మరో 129 మంది స్వల్ప గాయాలతో సంఘటన స్థలంలోనే చికిత్స పొందారు. ఈ ఘటనలో నిందితుడు కూడా తీవ్రంగా గాయపడటంతో.. అతనిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఈ అగ్నిప్రమాదంలో సబ్వే ట్రైన్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇందులో భాగంగా... ఆ నష్టం సుమారు 330 మిలియన్ డాలర్లు ఉండోచ్చని ది చోసన్ డైలీ తెలిపింది.
ఈ సందర్భంగా స్పందించిన దర్యాప్తు అధికారులు.. తన విడాకుల కేసు ఫలితంపై నిరాశ చెంది వాన్ ఈ చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం జూన్ 9న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రాసిక్యూషన్ కు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
