Begin typing your search above and press return to search.

రోజాకు మద్దతుగా మరో సీనియర్ హీరోయిన్

ఏపీ మంత్రి రోజాకు అలనాటి సినీ తారల నుంచి మద్దతు పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   8 Oct 2023 5:53 AM
రోజాకు మద్దతుగా మరో సీనియర్ హీరోయిన్
X

ఏపీ మంత్రి రోజాకు అలనాటి సినీ తారల నుంచి మద్దతు పెరుగుతోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆమెను అభ్యంతరకర రీతిలో దూషించిన నేపథ్యంలో ఇప్పటికే నటి ఖుష్బు, రాధిక శరత్ కుమార్, రమ్యకృష్ణ స్పందించారు. తాజాగా ఇప్పుడు మరో సీనియర్ నటి మీనా కూడా రియాక్ట్ అయ్యారు.

మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని నటి మీనా తీవ్రంగా తప్పుబట్టారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వీడియోను విడుదల చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బండారు సత్యనారాయణ చేసినవి నీచమైన వ్యాఖ్యలు అని, అవి ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఓ మహిళ గురించి పబ్లిక్​గా ఇలా మాట్లాడతారా? ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నారా? రోజులు మారాయి. భయపడి తలుపులు వేసుకుని ఏడ్చే రోజులు పోయాయి. మహిళలు బలంగా తయారవుతున్నారు. బండారు చేసిన వ్యాఖ్యలతో ఆయన దిగజారుడు మనస్తత్వం(చీప్ మెంటాల్టీ), ఆయన అభద్రత భావం, అసూయకు ఇవి నిదర్శనమని చెప్పారు.

నటిగా, తల్లిగా, పొలిటికల్ లీడర్‌గా, మహిళగా నిజ జీవితంలో ఆమె గురించి నాకు తెలుసు. మంత్రి రోజా చేసే పోరాటానికి తాను అండగా ఉంటాను. మంత్రి రోజా నా సహ నటి. ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్​ వర్క్​ చేస్తారు. ఆమెను ఎవరూ కిందకు లాగలేరు. ఆమె ఎంతో దృఢమైన వ్యక్తి. బండారు చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి చర్యలు తీసుకోవాలని మీనా కోరారు.

ఇంకా మీనా మాట్లాడుతూ.. రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మంత్రి రోజా చేసే పోరాటానికి తాను అండగా, మద్దతుగా ఉంటానని వివరించారు. ఎంపి, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ, రమ్యకృష్ణతో పాటు పలువురు కూడా బండారు అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బండారు సత్యనారాయణని క్షమించకూడదని అన్నారు.