Begin typing your search above and press return to search.

కొత్త ట్విస్టు? పబ్జీ లవ్వర్ సీమాలో షాకింగ్ సీన్లు!

పాక్ ఆర్మీతోనూ.. ఆ దేశ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ తో ఆమెకు సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 July 2023 5:15 AM GMT
కొత్త ట్విస్టు? పబ్జీ లవ్వర్ సీమాలో షాకింగ్ సీన్లు!
X

నలుగురు పిల్లల తల్లి సీమా హైదర్ కు సంబంధించిన షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. భారత్ లో తనకంటే చిన్నోడైన సచిన్ తో ప్రేమాయణం తో భారత్ కు రహస్యంగా వచ్చేసి ఉంటున్న ఆమెకు సంబంధించి సరికొత్త విషయాలు బయట కు వస్తున్నాయి. పబ్జీ ఆట ను పాతికేళ్ల సచిన్ మీనాతో పాటు.. ఢిల్లీ లోని పలువురితోనూ ఆమె ఆడిన వైనం వెలుగు చూసింది. 30 ఏళ్ల సీమా హైదర్ ను తాజాగా యూపీ ఏటీఎస్ పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు.

పాక్ ఆర్మీతోనూ.. ఆ దేశ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ తో ఆమెకు సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనా అనే యువకుడితో ప్రేమ లో పడటం.. అతడి కోసం తన నలుగురు పిల్లల్ని తీసుకొని నేపాల్ మీదుగా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించటం.. అనంతరం గుట్టుగా ఉంటున్న వీరి పై పోలీసుల కు అందిన సమాచారంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. ఇటీవల బెయిల్ పొందిన వీరికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున మీడియా లో రావటం తెలిసిందే. సీమాను భారత్ లో ఉంచేసి.. ఆమె నలుగురు పిల్లల్ని మాత్రం పాకిస్థాన్ కు తిరిగి పంపేయాల ని ఆమె కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించటం తెలిసిందే.

ఆమెను వెంటనే పాక్ కు పంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు నిఘా అధికారుల కు ఫోన్ సమాచారం ఇవ్వటంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అనర్గళంగా ఇంగ్లిషు మాట్లాడుతున్న వైనం.. అడిగిన ప్రశ్నలకు ఆచితూచి అన్నట్లుగా జవాబులు ఇవ్వటం లాంటివి చూసిన అధికారుల కు కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఆర్మీతోనూ.. ఆ దేశ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో లింకులు ఉన్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గ్రేటర్ నొయిడా లోని రబుపురా లో ఉన్న సీమా ను ఆమె భర్త సచిన్ ను వారింటి నుంచి ఉదయాన్నే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయగా.. షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. పాకిస్థాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించిన తర్వాత సీమా.. తొలుత సంప్రదించింది సచిన్ ను కాదన్న కొత్త విషయం అధికారుల విచారణ లో వెలుగు చూసింది. ఆమెకు ఢిల్లీలోని మరికొందరితోనూ పబ్జీ పరిచయాలు ఉన్నట్లుగా గుర్తించారు.

తొలిరోజు విచారణ తర్వాత ఆమె తెలివిగా వ్యవహరిస్తోందని.. ఆమెకు సంబంధించిన విషయాల కు జవాబుల్ని రాబట్టటం అంత సులువైన పని కాదన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇంగ్లిషును అనర్గళంగా మాట్లాడటం.. పాకిస్థాన్ లో ఆమె పేరు మీద జారీ అయిన గుర్తింపు కార్డు మీదా కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సీమా తో పాటు ఆమె భర్తగా చెబుతున్న సచిన్ ను అతడి తండ్రిని యూపీ ఏటీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.