Begin typing your search above and press return to search.

షర్మిళకు సెక్యూరిటీ పెంచాలి... టీడీపీ నేత డిమాండ్!

ప్రత్యేక హోదా పేరు చెప్పి కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని వైసీపీని ఆమె తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 9:38 AM GMT
షర్మిళకు సెక్యూరిటీ పెంచాలి...  టీడీపీ నేత డిమాండ్!
X

ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ వైఎస్ షర్మిళ ఏపీలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా పేరు చెప్పి కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని వైసీపీని ఆమె తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో రివర్స్ లో షర్మిళపై ఫైరవుతున్న వైసీపీ నేతలు... ఆమె చంద్రబాబు వదిలిన బాణంగా వర్ణిస్తున్నారు! సోనియా గాంధీ దత్తపుత్రురాలిగా అభివర్ణిస్తున్నారు! ఈ సమయంలో.. ఆమెకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయ్యన్న పాత్రుడు!

అవును... చర్చ జరుగుతున్న అంశాన్నే మాట్లాడతారా.. లేక, చర్చ జరగాలని స్పందిస్తారో తెలియదు కానీ... తాజాగా మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు.. వైఎస్ షర్మిళకు ప్రాణ హాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. బాబయ్ ని చప్పినవారికి చెల్లిని చంపడం ఒక లెక్కకాదంటూ మాట్లాడారు! ఈ నేపథ్యంలో... ఆమెను రక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు!!

ఇదే సమయంలో... "జగన్‌ కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా లేదు.. నేనొక లెక్కా.? షర్మిలను అంతమొందించినా ఆశ్చర్య పడక్కర్లేదు.. అందువల్లే ఆమెకు భద్రత పెంచాలి.. రాజశేఖర్‌ రెడ్డి ఆస్తిలో షర్మిల వాటా అది జగన్‌ ఇవ్వడం లేదు. నాకూ ప్రాణహాని ఉంది.. గన్‌ మెన్‌ ను ఇస్తానని ఎస్పీ అంటే నేనే వద్దనేశా.. ఎక్కడ ఉన్నానో గన్‌ మెన్‌ లే సమాచారం ఇస్తారని.. అంటూ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక అధికారపార్టీ నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారని.. వారి అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందని ఆరోపించిన అయ్యన్నపాత్రుడు... ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని "సిద్ధం" సభ పెట్టారని ప్రశ్నించారు. విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను మిగిల్చారా అని అడిగారు. అందువల్ల... వచ్చే మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామని.. ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌ వెళ్లినా.. అమెరికాలో దాక్కున్నా లాక్కొచ్చి దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని తెలిపారు.