Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మ... ఎవరీ మహిళ?

అవును... ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ద్వారా కవలలకు రహస్యంగా జన్మనిచ్చింది షివోన్ జిలిస్ అనే మహిళ.

By:  Tupaki Desk   |   10 Sep 2023 2:30 AM GMT
ఎలాన్  మస్క్  ద్వారా రహస్యంగా కవలలకు జన్మ... ఎవరీ మహిళ?
X

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్విటర్‌ (ఎక్స్), టెస్లా ,స్పేస్‌ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చిన ఒక మహిళ సడన్ గా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ మహిళ పేరు ఏమిటి.. ప్రత్యేకత లేమిటి.. ప్రపంచ కుబేరుడిని ఆకర్షించగలిగిన స్పెషల్ క్వాలిటీస్ ఏమిటి అనేది ఆన్ లైన్ వేదికగా చర్చనీయాంశం అయ్యింది.

అవును... ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ద్వారా కవలలకు రహస్యంగా జన్మనిచ్చింది షివోన్ జిలిస్ అనే మహిళ. వెంచర్ క్యాపిటల్ ప్రపంచం స్టార్‌ గా అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్ అయిన ఈ మహిళ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలోనూ అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకుంది.

ఇదే సమయంలో ప్రముఖ బ్రెయిన్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్‌ లో డైరెక్టర్‌ గా కూడా తన ప్రత్యకతను చాటు కుంటున్న జిలిస్.. తాజగా మరోసారి వార్తల్లో నిలవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదే... బయోగ్రఫీ రైటర్‌ గా పాపులర్‌ అయిన వాల్టర్ ఐజాక్సన్.. మస్క్‌ బయోగ్రఫీ పుస్తకం రిలీజ్‌ కాబోతుండటమే!

మస్క్‌ బయోగ్రఫీ పుస్తక రచయిత వాల్టర్ ఐజాక్సన్... టెక్సాస్‌ లోని ఆస్టిన్‌ లోని జిలిస్ నివాసంలో కవల పిల్లల ఫోటోలను షేర్ చేసింది. అవును... అప్పట్లో కవల పిల్లలతో మస్క్, జిలిస్ ఫోటోలను వాల్టర్ షేర్‌ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే మస్క్ – జిలిస్ జంట ఈ పిల్లలను ఐవీఎఫ్‌ ద్వారా 2021 నవంబర్ లో జన్మనిచ్చింది.

ఇలా ఒక మగ, ఒక ఆడ కవలలకు జన్మనివ్వగా... వారిలో కుమారుడి పేరు స్ట్రైడర్ గా పెట్టగా, కుమార్తెకు అజూర్ గా నామకరణం చేశారు. దీంతో మస్క్‌ సంతానం మొత్తంగా తొమ్మిదికి చేరింది.

కాగా... మాజీ భార్య, కెనడా రచయిత జస్టిన్ విల్సన్‌ తో ఐదుగురు సంతానాన్ని కలిగి ఉన్న మస్క్... వీరితోపాటు సింగర్ గ్రింస్ తో ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన మొత్తం 5 + 2 + 2 = 9 మంది సంతానం ఉన్నారనమాట!

ఇక జిలిస్ తో మస్క్ కు 2015 లో పరిచయం ఏర్పడింది. అదే ఏడాది మస్క్ కోఫౌండర్ గా ఉన్న ఓపెన్ ఏఐ తో జిలిస్‌ - మస్క్‌ మధ్య పరిచయం ఏర్పడింది. ఇదే సమయలో 2016 జూలైలో మస్క్‌ స్థా పించిన న్యూరోటెక్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌ లలో ఒకరిగా ఈమె పేరు పొందారు అనంతరం.. మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెస్లాలో ప్రాజెక్ట్ మేనేజర్‌ గా కూడా ఆమె పనిచేశారు.

కాగా.. స్టీవ్ జాబ్స్, ఆల్బర్ట్ ఐన్‌ స్టీన్‌ వంటి వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందిన జీవిత చరిత్రల రచయిత ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ రాస్తున్న సంగతి తెలిసిందే. ఈమె రాసిన మస్క్‌ బయోగ్రఫీ సెప్టెంబరు 12న రిలీజ్‌ కానుంది. అయితే ఇప్పటికే ఆయన రాసిన బయోగ్రఫీలు అత్యధికంగా అమ్ముడయిన నేపథ్యంలో... మస్క్‌ బయోగ్రఫీ ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేయనుందనేది ఆసక్తిగా మారింది.