Begin typing your search above and press return to search.

డీలిమిటేష‌న్‌ ఎఫెక్ట్‌: సిట్టింగులు సేఫేనా.. ?

నాయ‌కులు పెరుగుతున్నార‌న్న చ‌ర్చ ఒక‌వైపు ఉన్నా.. సిట్టింగులు సేఫ్ అనే వాద‌న మరోవైపు వినిపిస్తోంది.

By:  Garuda Media   |   28 March 2026 11:00 PM IST
డీలిమిటేష‌న్‌ ఎఫెక్ట్‌: సిట్టింగులు సేఫేనా.. ?
X

పున‌ర్విభ‌న కార‌ణంగా.. పెర‌గ‌నున్న సీట్ల‌తో కొంత‌మంది కొత్త‌వారికి.. సీనియ‌ర్ల‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్ ద‌క్క‌ద‌న్న భావ‌న‌లో ఉన్న‌వారికి కూడా అవ‌కాశాలు మెండుగా క‌ల‌గ‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో మ‌రి సిట్టింగుల సంగ‌తేంటి? అనేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల వ‌ర‌కు.. ప‌నిచేయ‌ని ఎమ్మెల్యేలకు టికెట్ విష‌యంలో ఇదే సందేహం ఉండేది. త‌మ గ్రాఫ్‌ను స‌రిచేసుకోని ఎమ్మెల్యేల‌కు.. ఇదే బెంగ కూడా ప‌ట్టుకుంది.

కానీ.. ఇప్పుడు అలాంటి ధోర‌ణి వారిలో రాను రాను త‌గ్గుముఖం ప‌డుతోంది. నాయ‌కులు పెరుగుతున్నార‌న్న చ‌ర్చ ఒక‌వైపు ఉన్నా.. సిట్టింగులు సేఫ్ అనే వాద‌న మరోవైపు వినిపిస్తోంది. ``నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగితే మాకే మంచిది. ఈ విష‌యంలో ఎలాంటి అనుమానం లేదు`` అని తూర్పుగోదావ‌రి జిల్లాకుచెందిన ఓ మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సిట్టింగులకు సీట్లు అలానే ఉంటాయ‌ని కూడా వ్యాఖ్యానించారు. మ‌హా అయితే..ప‌రిధులు మారుతాయ‌ని చెప్పారు.

ఇది కూడా వాస్త‌వ‌మే.. ప‌రిధి మారిన‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గం స్వ‌రూపం పూర్తిగా మారిపోనివే ఎక్కువ‌గా ఉన్నా యి. దీంతో సిట్టింగుల స్థానంలోవేరే వారికి అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని కూడా అంటున్నారు. ఎందుకంటే.. పెరిగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త‌వారిని తీసుకున్న‌ప్పుడు.. సిట్టింగ్ స్థానాల్లోనూ ఎమ్మెల్యేల‌ను మార్చేస్తే.. అది వ్య‌తిరేక ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంటుంద‌న్న వాద‌న ఉంది. అందుకే.. సిట్టింగులు చాలా సేఫ్‌గా ఉంటార‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. 164 మంది కూట‌మి ఎమ్మెల్యేల‌లో.. మ‌హా అయితే.. 15-20 మందికి మాత్ర‌మే శ్రీముఖం చూపిస్తార‌ని తెలుస్తోంది. మిగిలిన 140 మంది సేఫ్‌గానే ఉంటార‌ని అంటున్నారు. అయితే.. వారిలో ప‌నితీరును కూడా మెరుగు ప‌రుచుకోవాల‌ని.. సానుభూతి కోణంలోనో.. మ‌రే కోణంలోనో కాకుండా.. స‌ద‌రు ఎమ్మెల్యేలకు ఇచ్చే ప‌రిస్థితిలో ఉంటే.. అది గెలుపున‌కు దారితీస్తుంద‌ని అంటున్నా రు. ఏదేమైనా.. గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మధ్య చాలా వ్య‌త్యాసం ఉంటుంద‌ని చెబుతున్నారు. దీంతో త‌మ‌కు ఎలాంటి ఇబ్బంద‌లూ రావ‌ని అంటున్నారు.