Begin typing your search above and press return to search.

పాస్‌పోర్ట్, వీసా లేకుండా విదేశీ ప్రయాణం.. ఎలా సాధ్యమో తెలుసా ?

విదేశీ ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే. ఏ దేశానికి వెళ్లాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది ఇటువంటి పత్రాలే.

By:  Tupaki Desk   |   15 April 2025 12:00 AM IST
Seamens Book: A Passport Alternative
X

విదేశీ ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే. ఏ దేశానికి వెళ్లాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది ఇటువంటి పత్రాలే. ఏదైనా దేశానికి ప్రయాణించడానికి మీ దగ్గర పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. వీసా కూడా చాలా అవసరం. అయితే, కొన్ని దేశాలు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తాయి. పాస్‌పోర్ట్, వీసా లేకుండా విదేశాలకు వెళ్లవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి మీ దగ్గర ఒక పత్రం ఉంటే సరిపోతుంది. ఆశ్చర్యంగా ఉందా? మీ దగ్గర వీసా, పాస్‌పోర్ట్ అవసరం లేని ఒక పత్రం గురించి తెలుసుకుందాం.

సీమెన్ బుక్

ఈ పత్రం పేరు సీమెన్ బుక్. ఇది మీ దగ్గర ఉంటే వీసా, పాస్‌పోర్ట్ వంటి పత్రాలు అవసరం లేదు. ఇది ఎక్కువగా ఓడరేవుల్లో ఉపయోగిస్తారు. అయితే, సీమెన్ బుక్‌ను విమానాశ్రయంలో విదేశాలకు వెళ్లడానికి కూడా ఉపయోగించవచ్చు. సీమెన్ బుక్‌ను కంటిన్యూయస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇది అధికారిక గుర్తింపు పత్రం. సీమెన్ బుక్‌ను ముఖ్యంగా మర్చంట్ నేవీ, క్రూయిజ్ లైన్‌లో పనిచేసే ఉద్యోగులకు జారీ చేస్తారు. ఇందులో పాస్‌పోర్ట్ లాగానే షిప్పింగ్ కంపెనీ ఉద్యోగుల పేర్లు, పుట్టిన తేదీలు, జాతీయత, విద్యా అర్హతలు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి.

ఈ పత్రం ఎవరికి లభిస్తుంది?

సీమెన్ బుక్‌ను ముఖ్యంగా ప్రొఫెషనల్స్‌కు జారీ చేస్తారు. ఇందులో మర్చంట్ నేవీ, క్రూయిజ్ లైన్‌లో పనిచేసే ఉద్యోగులు, చేపల పడవల్లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. సీమెన్ బుక్‌ను పాస్‌పోర్ట్‌లాగే గుర్తిస్తారు. ఉద్యోగులు తమ పోర్టులో డ్యూటీలో చేరినప్పుడు వీసా లాగా సీమెన్ బుక్‌ను ఉపయోగిస్తారు. అయితే, ప్రయాణం వ్యక్తిగతమైతే పాస్‌పోర్ట్, వీసా అవసరమవుతాయి.