Begin typing your search above and press return to search.

ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు ఇవ్వలేనని చేతులెత్తేసిన ఎస్ బీఐ!

ఎలక్ట్రోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి డేటాను డిజిటల్ రూపంలో తనకు ఇవ్వాలని కోరుతూ మార్చి 13న సమాచార హక్కు చట్టం కార్యకర్త లోకేశ్ బాత్రా పిటిషన్ దాఖలు చేశారు.

By:  Tupaki Desk   |   12 April 2024 6:02 AM GMT
ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు ఇవ్వలేనని చేతులెత్తేసిన ఎస్ బీఐ!
X

దేశ వ్యాప్తంగా పెను దుమారంగా మారిన ఎలక్ట్రోరల్ బాండ్ల ఉదంతానికి సంబంధించి తాజాగా సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నో చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన వివరాల్ని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు మాత్రం నో చెప్పింది. ఇది వ్యక్తిగత సమాచారంగా పేర్కొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ‘‘సంబంధిత రికార్డులు ఎన్నికల సంఘం వెబ్ సైట్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికి ఆర్టీఐ కింద వివరాలు ఇవ్వటం సాధ్యం కాదు’’ అని తేల్చి చెప్పటం గమనార్హం.

ఎలక్ట్రోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి డేటాను డిజిటల్ రూపంలో తనకు ఇవ్వాలని కోరుతూ మార్చి 13న సమాచార హక్కు చట్టం కార్యకర్త లోకేశ్ బాత్రా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆ వివరాల్ని తాము ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిజానికి ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాల్ని సుప్రీంకోర్టుకు ఇచ్చే సందర్భంలోనూ ఎస్ బీఐ పలు మార్లు చెప్పించుకోవటం.. తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకు ఇవ్వటం తెలిసిందే. తొలుత ఇచ్చిన సమాచారం సమగ్రంగా లేదని పేర్కొంటూ.. సుప్రీం అక్షింతలు వేసిన తర్వాత కానీ ఎస్ బీఐ అలెర్టు కాలేదు.

ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీం నుంచి విస్పష్టమైన ఆదేశాలు జారీ అయిన తర్వాతే ఎలక్టోరల్ బాండ్ల వివరాల్ని సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో అందించింది. ఆ తర్వాత ఆ వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. కానీ.. ఈ వివరాల్ని ఎస్ బిఐ మాత్రం సాధారణ ప్రజలకు ఇచ్చేందుకు సంసిద్ధంగా లేదన్న విషయం తాజా ుదంతంతో స్పష్టం చేసిందని చెప్పాలి.